రెబ్బెన: రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ జమ్మిడి సౌందర్య ఆనంద్, జడ్పిటిసి వేముర్ల సంతోష్లు అన్నారు. మంగళవారం రెబ్బెన మండలం సహకార సొసైటీ లో పిఎసిఎస్, చైర్మన్ కర్నాతం సంజీవ్ కుమార్ , వైస్ చైర్మన్ రంగు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు నాణ్యతతో కూడిన ధాన్యాన్ని తగిన గిట్టుబాటు కి కొనుగోలు కేంద్రాలలో విక్రయించి నచ్చని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మొదటి రకం 1960 రెండో రకం1940 క్వింటా కి తీసుకుంటారని అన్నారు. ధాన్యంలో తేమ శాతాన్ని 17 శాతం ఉంటే గిట్టుబాటు ధర ఉంటుందని రైతులకు కు అవగాహన కల్పించారు. ఆధార్ కార్డు జిరాక్స్ పట్టా పాస్ బుక్ జిరాక్స్ బ్యాంక్ ఎకౌంట్ జిరాక్స్ లు జత చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన ఎంపిటిసి,మధునయ్య సర్పంచుల సంగం మండల అధ్యక్షుడు చెన్న సోమశేకర్, గంగాపూర్ ఆలయ చైర్మన్ ఓల్వోజి వెంకటేశం చారి, డైరెక్టర్లు కడ్తల మల్లయ్య, అజయ్ జెస్వాల్,టీఆర్ ఎస్ నాయకులు మోడెం సుదర్శన్ గౌడ్, మహిళ నాయకురాలు కుందారపు శంకరమ్మ, రాపాల శ్రీనివాస్,సి ఈ ఓ సంతోష్, ఏ ఈ ఓ లు పరిమళ, శివకుమార్ లు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Tuesday, 17 May 2022
Wednesday, 4 May 2022
జై గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గా ఆకుల సురేష్ గౌడ్
రెబ్బెన : జై గౌడ సంక్షేమ సంఘం కొమరం భీమ్ జిల్లా అధ్యక్షులు గా ఆకుల సురేష్ గౌడ్ ని ఎన్నుకున్నట్లు జై గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ గౌడ్ మాట్లాడుతూ గౌడ సంక్షేమ సంఘం పురోగతి కోసం ఎంతో కృషి చేస్తానన్నారు. తన నియామకానికి కృషిచేసిన జై గౌడ సంక్షేమ సంఘం వ్యవస్థాపకు అధ్యక్షులు బుర మన్సూర్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్ గౌడ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Subscribe to:
Posts (Atom)