రెబ్బెన ; నేటి యువత డాక్టర్ బాబు జగ్జిమం రామ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పి ఆర్ టి యు టి ఎస్ కొమురం భీం జిల్లా అధ్యక్షులు ఏటుకూరి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం రెబ్బెన మండలం నక్కల గూడా ప్రాథమిక పాఠశాలలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి 112వ జయంతిని ఘనంగా నిర్వహించారు. బాబు జగ్జీవన్ రామ్ పటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి మిఠాయిలను పంచిపెట్టారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక దళిత కుటుంబంలో పుట్టి తన సేవలతో పోరాటాలతో దళితుల అభివృద్ధికి పాటుపడడం తో పాటు భారత దేశ ఉప ప్రధానిగా పనిచేసిన గొప్పవారని పొగిడారు. పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు తోట వినోద్ కుమార్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఒక దళిత నాయకుడే కాక కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవానికి నాంది పలికారని, రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు 1971 వ సంవత్సరంలో జరిగిన యుద్ధంలో పాకిస్తాను ఓడించారని తెలియజేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయమని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు తోట వినోద్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ఖాదర్, సదానందం, జిల్లా కార్యదర్శి తిరుపతయ్య మండల ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్ వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నాగరాజు, సోమశేఖర్, శ్రీధర్, రవి, లింగయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.