కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 18 ; వరద భాదితులకు సహాయం చేసి మానవత్వాన్ని చాటుకోవాలని బెల్లంపల్లి సింగరేణి ఏరియా సింగరేణి సేవా సంస్థ అధ్యక్షురాలు అనురాధ రవిశంకర్ అన్నారు. శనివారం వారి ఆదేశానుసారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వరద భాదితుల సహాయార్ధం రెబ్బెన మండల గోలేటి కాలనీలో దుప్పట్లు, చీరలు మరియు వంట సామగ్రి సేకరించడం జరిగిందని డి వై పి ఎం జె కిరణ్ తెలిపారు. అదేవిధంగా సోమవారం గోలేటి టౌన్ షిప్ లో వరద భాదితుల సహాయార్ధం వస్తువులు సేకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ విధంగా సేకరించిన వస్తువులను ఆసిఫాబాద్ జిల్లా పాలనాధికారికి అందచేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డి ఫై ఎం లు రాజేశ్వర్, సుదర్శనం, రామశాస్ట్రీ,సేవాసమితి సీనియర్ సభ్యులు కుందారపు శంకరమ్మ, సొల్లు లక్ష్మి, సేవ సభ్యులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ తదితరులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Saturday, 18 August 2018
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 368వ జయంతి వేడుకలు
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 18 ; శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 368 వ జయంతిని శనివారం రెబ్బెన మండల కేంద్రంలోని అతిధి గృహంలో గౌడ కులస్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ హక్కుల పోరాట సమితిజిల్లాప్రధానకార్యదర్శి కేసరి ఆంజనేయులుగౌడ్ ముఖ్య అతిధిగ పాల్గొని మాట్లాడుతూ ఆనాటి మొఘలుల కాలంలో పంటల పై వేసే పన్ను కంటే కల్లు పై వేసే పన్ను అధికంగా ఉండేదని ఆనాడు బిసి కులాలు దళిత వర్గాలను ఏకం చేసి జమిందారులు, సుబెదరులకు ఎదురుతిరిగి పోరాటం చేసిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్నది అని అన్నారు .ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘ జిల్లా అధ్యక్షుడు మోడెం సుదర్శన్ గౌడ్, అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్, మేడిపల్లి లక్ష్మీనారాయణ, నాయకులూ రంగు మహేష్ గౌడ్, గుడిసెల వెంకటేశ్వర్వుగౌడ్, స్వామి గౌడ్, శ్రవణ్ గౌడ్, శాంతి కుమార్ గౌడ్, బొంగు దేవక్క తదితరులు పాల్గొన్నారు.
ముంపు పంట భూములకు నష్టపరిహారం కై వినతి ; పరిశీలిచిన రెవెన్యూ అధికారులు
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 18 ; గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద వాగు ఉప్పొంగి రెబ్బెన మండలం నవేగం గ్రామంలోని సుమారు 500 ఎకరాల పంట మునిగిపోయినట్లు నవేగం గ్రామస్తులు శనివారం రెబ్బెన మండల తహసీల్దార్ కు వినతి పత్రం అందచేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ తమ పొలాలలో పత్తి, కంది, మిరప పంటలు పూర్తిగా మునిగి పోయినట్లు తెలిపారు. తమకు ప్రభుత్వం తరపున నస్టపరిహారం ఇపించాలని కోరారు. తహసీల్దార్ స్పందించి నవేగం గ్రామానికి వెళ్లి జరిగిన నష్టాన్ని అంచనా వేయమని అధికారులను ఆదేశించారు. పంట చేనులను రెవెన్యూ అధికారులు పరిశీలిచి నష్ట పరిహారాల పంట వివరాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జాదవ్ ప్రేమ్ దాస్, మండల కాంగ్రెస్ ఎస్ సీ సెల్ అధ్యక్షులు కుడుక మొండయ్య, పావే వెంకటి, చౌదరి వగు, ఏకొంకర్ నానాజీ, బొర్కెటే భీంరావు లు ఉన్నారు.
ఎద్దుకు వినతి పత్రం ఇచ్చిన గ్రామ పంచాయతీ కార్మికులు
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 18 ; గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిస్కరించాలని వినూత్న నిరసన లో భాగంగా ఎద్దుకు వినతి పత్రం ఇచ్చారు. నిరవదిక సమ్మె రెబ్బెనలో శనివారానికి 27వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్, టి ఆర్ఎస్ కేవి జిల్లా కార్యదర్శి నగవెళ్లి సుధాకర్ లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా చేయాలని అన్నారు. అలాగే మంత్రి కే టి ఆర్ కు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా చేయాలని కోరారు. కనీస వేతనం 18 వేలు ఇవ్వాలని, అర్హులైన వారందరిని పంచాయతీ కార్యదర్శి గా నియమించాలి అని కోరారు. పక్క రాష్ట్రంలో ఇస్తున్నట్లు వేతనాలు ఇవ్వాలని, కర్ణాటక రాష్ట్రము వలే ప్రత్యేక గ్రాంట్ కేటాయింపు చేయాలని అన్నారు. హక్కులు సాధించే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని అన్నారు. ముఖ్యమంత్రి రోజుకో ప్రకటన చేస్తూ కార్మికులను గందరగోళం గా తయారు చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిస్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు రాచకొండ రమేష్,వైస్ ప్రెసిడెంట్ గోగర్ల శంకర్,లాలు సింగ,కోశాధికారి కళావేని తిరుపతి, నాయకులు బాబాజి,సత్యయ్య ,వెంకటేష్ తదితరులు ఉన్నారు.
Friday, 17 August 2018
స్వర్గీయ భారత రత్న అటల్ బిహారి వాజపేయి కి నివాళి
కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 17 ; మాజీ ప్రధానమంత్రి భారత రత్న అటల్ బిహారి వాజపేయి గురువారం సాయంత్రం స్వర్గస్తులైనందుకు రెబ్బెన మండల బీజేపీ శాఖ రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించినట్లు మండల శాఖ అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మల్రాజ్ రాంబాబు, నాయకులూ రత్నం లింగయ్య, పసుపులేటి మల్లేష్, పందిర్ల కనకయ్య, ఇగురపు సంజీవ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
అసిఫాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న మర్సుకోల సరస్వతి
కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 17 ; రాబోయే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అసిఫాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నానని ఆసిఫాబాద్ మాజీ సర్పంచ్ మార్సుకోల సరస్వతి అన్నారు. శుక్రవారం రెబ్బెన మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో నియోజకవర్గ ఓటర్లు ఆదరిస్తారని, ఆసిఫాబాద్ సర్పంచ్ గా అతి తక్కువ నిధులతో అసిఫాబాద్ పట్టణాన్ని అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి పరిచానని అన్నారు. గత 2014 లో ఎన్నీకలో టిడిపి పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు 26,000 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయని . అప్పుడు టిడిపి పార్టీ లేకుండా అన్ని ఓట్లు వేసి ఆదరించిన నియోజకవర్గ ప్రజలకు నేను ఎప్పుడు రుణపడి ఉంటానని, వచ్చే ఎన్నికల్లో ఆదరించి మద్దతు తెలపాలని కోరరు. రాబోయే రెండు లేదా మూడు నెలల్లో ఏ పార్టీ 'బి' ఫాం తో నిలబడ పోతున్నది తెలుపుతానన్నారు. . ఈ కార్యక్రమంలో సరస్వతి మద్దతుదారులు తోట లక్ష్మణ్, ఎండి. ఖలీద్, వినోద్, నాగోసీ శంకర్, లెండుగురే ఆనందరావు, మొర్లే శ్రీనివాస్, గుర్నులే రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 17 ; రెబ్బెన మండలం రాంపూర్ బుద్దనగర్ గ్రామం వద్ద అక్రమంగా 45 క్విటాళ్ళ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న AP 15 TB 1306 వ్యాన్ ను రెబ్బెన సర్కిల్ ఇనస్పెక్టర్ రమణా మూర్తి నేతృత్వంలో శుక్రవారం పట్టుకున్నట్లు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు.
అక్రమ రవాణాకు సిద్ధం గా ఉంచిన టేకు దుంగల స్వాధీనం
కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 17 ; రెబ్బెన మండలం గోలేటిలో గురువారం అర్ధరాత్రి అక్రమ రవాణాకు సిద్ధం ఉంచిన సుమారు 2 లక్షల రూపాయల విలువగల 88 టేకు దుంగగాలను స్వాధీనం చేసుకున్నట్లు రెబ్బెన ఎస్సై ఢీకొండ రమేష్ శుక్రవారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి గోలేటి గ్రామ శివారులో టేకు దుంగలను స్వాధీనం చేసుకొని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ కు సమాచారమిచ్చి తదుపరి చర్య నిమిత్తం అటవీశాఖ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.
Thursday, 16 August 2018
ప్రజా సమస్యల పై పోరాడుతాం ; మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్
కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 16 ; ప్రజా సమస్యలపై పరిష్కారానికి ఆగస్టు పద్ధెనిమిది నాడు కొమురంభీం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు జరుగును సామూహిక ధర్నాను విజయవంతం చేయాలని సిపిఐ మాజీ శాసనసభా పక్ష నేత గుండా మల్లేష్ పిలుపునిచ్చారు. గురువారం అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల నదిని నిర్మించకుండా జిల్లాలో రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని తద్వారా రెండు లక్షల రెండు లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందని పరిస్థితి నెలకొందని కేవలం రెబ్బెన మండలంలోని పందొమ్మిది వేల ఎకరాల భూమిని సాగు నీరందేదని అన్నారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర సర్కారు విఫలం చెందిందని డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు కట్టించకపోవడం అన్యాయమని ఎన్నికల హామీలన్నీ పురస్కరించుకుని ముఖ్యమంత్రి గారు ప్రగతిభవన్ ని కట్టుకుని పేద ప్రజలను విస్మరించారని అన్నారు పేదలకు మూడేకరాల భూమి ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవని విమర్శించారు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలను నిర్మించాలని డిమాండ్ చేశారు మంచిర్యాల నుండి వాంకిడి వరకు రాష్ట్రీయ రహదారి గుంతల మయమైందని అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి రహదారుల మరమ్మతులను చేపట్టకపోవడం చేతకాని తనానికి నిదర్శనమని అన్నారు పల్లెల్లో రోడ్లు డ్రైనేజీ త్రాగునీరు సమస్యలను పరిష్కరించాలని కొన్ని రోడ్లు బురదమయానికి నార్లు వేసేలా ఉన్నాయని అన్నారు పోడు భూములను సాగు చేస్తున్న రైతులకు పట్టా హక్కులు కల్పించాలని గోలేటి మరియు ఇతర ప్రాంగణంలోని ఇల్లు కట్టుకున్న ప్రజలకు ఇళ్ల పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మరియు మూడు ఎకరాల వ్యవసాయ భూమిని ఇవ్వాలని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని అన్నారు. ఈకార్యక్రమం లో మండల కార్యదర్శి ఆయిల్లా నరసయ్య, ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్, డివిజన్ కార్యదర్శి పూదరి సాయి కిరణ్, డివిజన్ ఉపాధ్యక్షుడు పర్వతి సాయి కుమార్, సిపిఐ నాయకులు రామడుగుల శంకర్ బద్రీ తదితరులు పాల్గొన్నారు.
భారీ వర్షానికి నిండిన చెరువులు, కుంటలు
కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 16 ; రెబ్బెన మండలంలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారే వరకు కురిసిన భారీ వర్షానికి మండలంలోని చెరువులు, కుంటలు నిండిపోయాయి. వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలకు ఇబ్బంది కలిగింది. తుంగేడ లో డోంగ్రి శెంకర్ ఇల్లు పూర్తిగా ధాంశం అయింది. పాసిగామా గ్రామా శివారు లో వాగు పరాశర ప్రాంతాల లో పత్తి వరి పంట్ట చేన్లు పూర్తి నీట మునిగాయి. ముఖ్యంగా గోలేటి పంచాయతీ పరిధిలోని గుండాల వాగు ఉద్రితికి ఖైర్గుడ గ్రామానికి రాకపోకలు పూర్తిగా స్తంభిచిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
Wednesday, 15 August 2018
కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం
కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 15 ; తెలంగాణా ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమంలో కంటి సమస్యలు ఉన్నవారు ఉచితంగా పరీక్షలు చేయించుకోవాలని రెబ్బెన ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్, జడ్పీటీసీ అజ్మిరా బాబు రావు లు అన్నారు. బుధవారం రెబ్బెన మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్య మంత్రి ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం నేటి నుంచి 2019 జనవరి 28 వరకు కొనసాగుతుందన్నారు. ఈ కేంద్రంలో ఉచితంగా కంటి పరీక్షలుచేసి, అవసరమైతే కంటి అద్దాలు ఇవ్వబడతాయన్నారు. పరీక్షకు వచ్చేవారు తమ ఆధార్ కార్డు ను వెంట తీసుకొనిరావాలని అన్నారు. సుశిక్షితులైన వారితో ఈ పరీక్షలు చేయబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాధురి, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, తెరాస టౌన్ అధ్యక్షురాలు మన్యం పద్మ, ఆసుపత్రి సిబ్బంది కమల్, ప్రవీణ్, మొయిజ్ తదితరులు పాల్గొన్నారు.
మేదరి సంఘ భవన నిర్మాణానికి వినతి
కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 15 ; జిల్లా కేంద్రం లో మేదరి సంఘము భవనం నిర్మాణం కోసం స్థలం మరియు నిధుల మంజూరు కోసం బుధవారం ఆసిఫాబాద్ ఎం ఎల్ ఏ శ్రీమతి కోవ లక్ష్మీ కి రెబ్బన జడ్పీటీసీ అజ్మేర బాపురావు, రెబ్బన ఎంపీపీ కార్ణాధం సంజీవ్ కుమార్ ల సమక్షంలో మేదరి సంఘము జిల్లా ప్రధానకార్యదర్శి రాపాల శ్రీనివాస్ వినతిపత్రం అందజేయడం జరిగింది. అంతకు ముందు జిల్లా కేంద్రంలో జరిగిన 72 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో వెదురు తో చేసిన పలు ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. ఈ కార్యక్రమంలో జి ల్లా యువజన సంఘం అధ్యక్షుడు గట్టు తిరుపతి, జిల్లా వెదురు పారిశ్రామిక సంఘము అధ్యక్షుడు గట్టురాజకనకయ్య, మహేంద్ర సంఘము నాయకులు కొంటు మహేందర్, లు పాల్గొన్నారు.
సింగరేణి కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 15 ; బెల్లంపల్లి ఏరియా గోలేటి సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్ కార్యాలయంలో 72 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు .జనరల్ మేనేజర్ కే .రవిశంకర్ ప్రెతాకావిష్కరణ గావించి ప్రసంగిస్తూ ఎందరో మహనీయుల త్యాగఫలంగా లభించిన స్వాతంత్ర్యాన్ని మనం కాపాడుకోవాలని, చేసే ప్రతి పనిని నిబద్దతతో నిర్వహించాలని తెలిపారు. సింగరేణి సంస్థ గురించి మాట్లాడుతూ సింగరేణి బెల్లంపల్లి ఏరియాలో గత 3 సంవత్సరాలుగా 100 శాతం ఉత్పత్తి లక్ష్యాలను సాధించి, లాభాల బాటలో ఉన్నామని అన్నారు. గత ఆర్ధిక సంవత్సరం 380 కోట్ల లాభాలలో ఉన్నట్లు తెలిపారు. ఉత్తమ కార్మికులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందచేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సింగరేణి సేవ సమితి అధ్యక్షురాలు అనురాధ రవిశంకర్, ఎస్ ఓ టూ జీఎం వీరాస్వామి, డోర్లి పర్సనల్ మేనేజర్ కొండయ్య, డీజీపీఎం జ్ కిరణ్, డీపీఎం లు రాజేశ్వర్, రామశాస్ట్రీ, టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాస్ రావు, సేవ సమితి సభ్యులు, కార్మికులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)