కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 18 (వుదయం ప్రతినిధి); వారసత్వ ఉద్యాగాలు సాధన కోసం జరుగుతున్న సమ్మెను విచ్చినం చేయడానికి యాజమాన్యం మరియు టీ బి జి కే ఎస్ యూనియన్ నాయకులూ ఆదివారము రోజున ప్లే డే అటువంటి నిబంధనలు లేకుండా ఏర్పాటు చేసి సమ్మెను విచ్చినం చేద్దామని కుట్రపండుతున్నారని గోలేటి ఏ ఐ టి యూ సి బ్రాంచి కార్యదర్శి ఎస్ తిరుపతి అన్నారు. ఆదివారం గోలెటీ లోని కే ఎల్ మహాంధ్రభవనంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాలు సమ్మే చేస్తే,యాజామాన్యం,తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కలసి గనుల వద్ద విందులు ఏర్పాటు చేసి సమ్మేను విఫలం చేయాడానికి ప్రయత్నిస్తుందని అన్నారు కార్మికుల న్యాయపరమైన వారసత్వ ఉద్యోగాల కోరకు జరుగుతున్న సమ్మేకు TBGKS కలసి రావాల్సింది పోయి సమ్మేను విఫలం చేయటానికి ప్రయత్నం చేయడం సిగ్గుచేటు అని ఇప్పటిక్తేన సమ్మే లో కలసి రావాలని లేకపోతే గనుల వద్దకు రానివ్వమని అన్నారు. చేయవచ్చని ఎరా చూపింది , అయినప్పటికీ మెజార్టీ కార్మికులు ప్లే డే ను నిరాకరించి సమ్మెలో ని పాల్గొన్న మెజార్టీ కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులూ జగ్గయ్య బయ్య మోగిలి, శ్రీనివాస్, రాజస్, కిరణ్ చంద్రశకర్ తదితరులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Sunday, 18 June 2017
రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ; సింగరేణి కార్మికుల పిల్లలు
రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ; సింగరేణి కార్మికుల పిల్లలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 18 (వుదయం ప్రతినిధి); సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించి కార్మికుల పిల్లలకు న్యాయం సింగరేణి కార్మికుల పిల్లల సంఘం నాయకులు దుర్గం రవీందర్, సిరికొండ రవికిరణ్, ముద్దసాని శ్రావణ్ లు డిమాండ్ చేశారు. ఆదివారం రోజున సింగరేణి కార్మికుల పిల్లల సంఘం ఆద్వర్యంలో గోలేటిలోని అంబేద్కర్ విగ్రహం ముందు కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు జరిగిన ఉద్యమంలో ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమాలు చేశామని, జైలుకెళ్ళి కేసులు ఎదుర్కున్నామని, విద్యను సైతం పక్కన పెట్టి ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నమని గుర్తు చేశారు. ఆంధ్ర పాలనలో సింగరేణి కార్మికులకు వారి పిల్లలకు తీవ్ర అన్యాయం జరిగిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే మా భవిష్యత్తు మరుతుందని ఉద్యమాలు చేశామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం జరిగిన ఎన్నికల్లో టి.ఆర్.యస్. పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం వారసత్వ ఉద్యోగాలపై పెడతానాని చెప్పిన ముఖ్యమంత్రి ఇచ్చిన హమీని విస్మరించడం జరిగిందని అన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకై జరుగుతున్న సమ్మెను విఫలం చేయాడానికి చూస్తున్న కార్మిక సంఘాల నాయకులు ఇప్పటికైన సమ్మెలో పాల్గొని వారసత్వ ఉద్యోగాల సాధనకు పోరాటం చేయాలని, సమ్మెను విఫలం చేసే ప్రయాత్నాలు మానుకోవాలని అన్నారు. సమ్మెను విఫలం చేసి కార్మికులకు వారి పిల్లలకు అన్యాయం చేసే కార్మిక సంఘాలకు తగిన బుద్ధి చేప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికుల పిల్లలు రవి, కిరణ్, మహేష్, మనోహర్, రవికుమార్, సంజీవ్, రమేష్, నరేష్, మహేంధర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
Saturday, 17 June 2017
కార్మిక సంఘాలకు సహకరించిన వ్యాపార, వాణిజ్య సంస్థలు
కార్మిక సంఘాలకు సహకరించిన వ్యాపార, వాణిజ్య సంస్థలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 17 (వుదయం ప్రతినిధి); సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని గత మూడు రోజులుగా జాతీయ కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈరోజు కార్మిక సంఘాల,రాజకీయ పార్టీల పిలుపు మేరకు గోలేటిలో వ్యాపార, వాణిజ్య సంస్థల బంద్ విజయవంతం అయిందని సిపిఐ గోలేటి పట్టణ కార్యదర్శి జగ్గయ్య, ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ లు తెలియజేశారు, బంద్ కు సహకరించిన వ్యాపార, వాణిజ్య సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వారసత్వ ఉద్యోగాల సాధనకు జాతీయ కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనలకు సిపిఐ పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు
అంతర్జాతీయ యోగ దినోత్సవ గోడ ప్రతుల విడుదల
అంతర్జాతీయ యోగ దినోత్సవ గోడ ప్రతుల విడుదల
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 17 (వుదయం ప్రతినిధి); అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గోడ ప్రతులను సింగరేణి పి అండ్ పి శ్రీ బి భాస్కర్ రావు, ,జిమ్ రవిశంకర్ లు శనివారం గోలేటి జిమ్ కార్యాలయం లో విడుదల చేసారు ఈ సందర్భం గ మాట్లాడుతూ జూన్ 21న సింగరేణీయులు అందరు వారి కుటుంబ పరిరక్షణకు సంస్థ అన్ని డిపార్టుమెంట్ల వద్ద ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు యోగాచార్యులచే నిర్వహింపబడే కార్యక్రమాలకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరారు. డిజిఎం పర్సనల్ జ్ చిత్తరంజన్ ఎస్ ఓ టు జిమ్ కొండయ్య ,రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు
సింగరేణి సంస్థలో సమ్మె ప్రభావం లేదు ; డైరెక్టర్ పి అండ్ పి భాస్కర్ రావు
సింగరేణి సంస్థలో సమ్మె ప్రభావం లేదు ; డైరెక్టర్ పి అండ్ పి భాస్కర్ రావు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 17 (వుదయం ప్రతినిధి); సింగరేణిలో సమ్మె ప్రభావం లేదనిమిగిలిన కార్మిక సోదరులు విధుల్లోకి వచ్చి సంస్థ అభివృద్ధికి పాటుపడాలని ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ శ్రీ బి, భాస్కర్ రావు అన్నారు. శనివారం రెబ్బెన మండల్ గోలేటి జనరల్ మేనేజర్ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ బెల్లంపల్లి సింగరేణి ఏరియా లోని గత మూడు రోజులుగా కొనసాగుతున్న కార్మికుల నిరవధిక సమ్మె పక్షికంగానే కొనసాగుతుందన్న గత మూడు రోజులుగా 50 శాతం కంటే ఎక్కువగానే కార్మికులు హాజరై 1,75,000 టాన్స్ డిస్పాచ్ తోపాటు ఒక్క రోజులో 23,300 బొగ్గు ఉత్పత్తి సాదించమన్న సింగరేణి పీ. పీ.భాస్కర్,సమ్మెను విడనాడి సంస్థ అభివృద్దికి కార్మికుల సంక్షేమం కొరకై అలోచించి విధులకు హాజరు కావాలన్నారు , సింగరేణి డైరెక్టర్ అండ్ బెల్లంపల్లి జి యం కె. రవిశంకర్ డిజిఎం పర్సనల్ జ్ చిత్తరంజన్ ఎస్ ఓ టు జిమ్ కొండయ్య ,రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
వారసత్వ ఉద్యోగాలు అమలు చేయాలి ఎఐటియుసి గోలేటి బ్రాంచ్ కార్యదర్శి తిరుపతి
వారసత్వ ఉద్యోగాలు అమలు చేయాలి
- ఎఐటియుసి గోలేటి బ్రాంచ్ కార్యదర్శి తిరుపతి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 17 (వుదయం ప్రతినిధి); సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించే వరకూ కార్మికుల పక్షాన పోరాడుతామని ఎఐటియుసి గోలేటి బ్రాంచ్ కార్యదర్శి S.తిరుపతి అన్నారు.సింగరేణిలో జరుగుతున్న సమ్మె సందర్భంగా శనివారం రోజున సమ్మెను విఫలం చేయాలని చూస్తున్న టిబిజికెయస్ నాయకులకు కనువిప్పు కలాగాలని గోలేటిలోని తెలంగాణ తల్లి విగ్రహనికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించడంలో యాజమాన్యం,టీ.ఆర్.యస్., టిబిజికెయస్ పూర్తిగా విఫలం చెందిందని ఆరోపించారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి గుర్తింపు సంఘంగా గెలిచిన టిబిజికెయస్ గ్రూపులుగా విడిపోయి డబ్బుల విషయంలో కోర్టు చుట్టు తిరుగుతూ నాలుగు సంవత్సరాలు కాలాయపన చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొదటి సంతకం వారసత్వ ఉద్యోగాల పైనే పెడుతానని హమీ ఇచ్చిన కెసిఆర్ మరచిపోయారని అన్నారు. కనీసం కార్మిక చట్టాలపై అవగాహన లేని టిబిజికెయస్ సమ్మెను విఫలం చేయాడానికి చూడడం సిగ్గుచెటన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మికులు స్వచ్చందంగా సమ్మెలో పాల్గొంటే సమ్మెను విఫలం చేయాడానికి యాజమాన్యం టిబిజికెయస్ టి ఆర్ యస్ కుట్రలు పన్నుతుందని దానిని కార్మికులు గమనిస్తున్నరని అన్నారు. యాజమాన్యం ఎప్పుడు లేని విధంగా సింగరేణిలో పోలీసు బలగాలను మోహరించి కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేయిస్తుందని దీనిని సిపిఐ పార్టీ ఖండిస్తూందని అన్నారు. అరెస్టు చేసిన కార్మిక నాయకులను వెంటనే విడుదల చేసి పోలీసులను వెనక్కు పంపించాలని డిమాండ్ చేశారు. అలాగే టిబిజికెయస్ కార్మికుల పక్షామో కాదో తెలియజేయాలని, ఇప్పటికైనా వారసత్వ ఉద్యోగాల కల్పనకై జాతీయ కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెలో కలిసి రావాలని లేకుంటే టిబిజికెయస్ కు కార్మికులు తగిన బుద్ధి చేప్తారని హెచ్చరించారు.శనివారం నిర్వహించిన కోల్ బెల్ట్ బంద్ లో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి జగ్గయ్య, ఎఐటియుసి నాయకులు శేషు, కిరణ్, అంబేద్కర్, శ్రీనివాస్, సత్యనారాయణ, చారి,నర్సయ్య, ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు కస్తూరి రవి తదితరులు పాల్గొన్నారు
Friday, 16 June 2017
రెబ్బెన పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా పోలీస్ అధికారి
రెబ్బెన పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా పోలీస్ అధికారి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 16 కొమురంభీంజిల్లా లోని రెబ్బెన పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పిసన్ ప్రీత్ సింగ్ గారు శుక్రవారం రోజున ఆకస్మికం గా తనిఖి చేసారు .ఈ సందర్బం గా అయన స్టేషన్ లోని పెండింగ్ కేసు లు యొక్క పూర్వ పరాలు పరిశిలిచారు. గత రెండు రోజులుగా జరుగుతున్నా సింగరేణి సమ్మె సందర్భంగా గనులవాడ సుమారు వందకు పైగా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమ్మె చేస్తున్న కార్మికులు ఎలాంటి అవాంఛనీయమైన కార్యక్రమాలకు పాల్పడిన చట్ట రీత్యా చెర్యలు తప్పవని హెచ్చరించారు. పరిష్కారం కానీ కేసులు ,వాటి నమోదు గురించి ఎస్సై నరేష్ కుమార్ ను అడిగి తెలుసుకన్నారు ,ప్రజా సమస్యల పైన సత్వరం స్పందించాలని సిబ్బంది ను ఆదేశించారు. క్రమము తప్పకుండ వి .పి.ఓ లు గ్రామాలను సందర్శించి ,గ్రామాలలో నెలకొని వున్నా సమస్యలను తన ద్రుష్టి కు తిసుకురావాలని వి.పి.ఓ లను ఆదేశించారుఈ కార్యక్రమము లొ కాగజ్ నగర్ డిఎస్పి హబీబ్ ఖాన్ , సి ఐ సీఐ మదన్ లాల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
యధావిధిగా కార్మికులు విధుల్లోకి హాజరు
యధావిధిగా కార్మికులు విధుల్లోకి హాజరు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 16 (వుదయం ప్రతినిధి); జాతీయ సంఘాల పిలుపు మేరకు కార్మికులు చేపట్టిన సమ్మె రెండోరోజున బెల్లంపల్లి ఏరియాలోని కార్మికులు ఎలాంటి ఆటంకం లేకుండా విధులకు హాజరు అయ్యారు అని డి జి ఎం పార్సెనల్ చిత్తరంజన్ కుమార్ తెలిపారు. బెల్లంపెల్లి ఏరియాలోని గనులలో కార్మికులు విధులకు హాజరై నిర్దేశించిన లక్షాన్ని 96 శాతంతో 18.122 టన్నుల ఉత్పత్తి సాదించారని తెలిపారు. మిగితా కార్మికులు కూడా విధులలో హాజరై తమ జితబథ్యాలు నష్ట పోకుండా సంస్థ అభివృద్ధికి సహకరించాలన్నారు. శుక్ర మరియు శనివారము విధులు నిర్వహించిన ఉద్యగులకు ఆదివారము నాడు కూడ హాజరు వెయ్యడం కూడా జరుగుతుందని తెలిపారు.
Thursday, 15 June 2017
కార్యరక్షత ను అబినందించిన జిల్లా అధికారులు
కార్యరక్షత ను అబినందించిన జిల్లా అధికారులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 15 (వుదయం ప్రతినిధి); కుమ్రంభీమ్ జిల్లా లో 4 వ తెలంగాణా రాష్ట్ర అవతరణ వేడుకలను వైభవముగా ,ఎలాంటి అవాంతరాలు ను కలుగనియకుండా పటిష్టం గా సమర్ధ వంతం గా నిర్వహించినందుకు గాను గురువారం స్థానిక పాలనాఅదికారి కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారి సన్ ప్రీత్ సింగ్ మరియు జిల్లా పాలనా అదికారి చంపాలాల్ గార్లు కాగజ్ నగర్ డిఎస్పి హబీబ్ ఖాన్ ను మరియు ఆసిఫాబాద్ టౌన్ సి.ఐ సతీష్ గారిని ప్రశంస పత్రం తో సన్మానించి ,విధి నిర్వహణ లొ అంకిత బావం తొ పని చేసి జిల్లా కు పోలీసుశాఖ కు మున్ముందు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమములో,ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు ,ఎస్బి ఎసై లు శివకుమార్ ,శ్యాం సుందర్, ఎస్పి సీసీ శ్రీనివాసు ,మరియు కలెక్టర్రేట్ సిబ్బంది పాల్గొన్నారు.
గత కొంత కాలంగా బాధిస్తున్నకోతుల బెడద ఉండదు ; పెసరు వెంకటమ్మ
గత కొంత కాలంగా బాధిస్తున్నకోతుల బెడద ఉండదు ; పెసరు వెంకటమ్మ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 15 (వుదయం ప్రతినిధి); రెబ్బన మండల కేంద్రంలో గత కొంత కాలంగా బాధిస్తున్న కోతుల బెడద ఇక ఉండదని సర్పంచ్ పెసరు వెంకటమ్మ అన్నారు. ఆమె మాట్లాడుతూ గ్రామా పంచాయితీ అధ్యరంలో అటవీ శాఖ అధికారుల సహాయంతో కోతులను బోనులు ద్వారా బందించి ఆటవి దురా ప్రాంతాలకు తరిలించడం జరుగుతుందని తెలిపారు. అటవీ అధికారులతో మరిన్ని పరికరాలతో కోతులను వేగవంతగా దూరప్రాంతాలకు తరలించే విదంగా చర్యలు తీసుకోవాలని చర్చించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది , సింగాల్ విండో డైరెక్టర్ మధునయ్య తదితరాలు ఉన్నారు.
కార్మికులు విధుల్లోకి హాజరై సహకరించాలి
కార్మికులు విధుల్లోకి హాజరై సహకరించాలి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 15 (వుదయం ప్రతినిధి); జాతీయ సంఘాల పిలుపు మేరకు కార్మికులు చేపట్టిన సమ్మె బెల్లంపల్లి ఏరియాలోని కార్మికులు ఎలాంటి ఆటంకం లేకుండా విధులకు హాజరు అయ్యారు అని డి జి ఎం పార్సెనల్ చిత్తరంజన్ కుమార్ తెలిపారు బెల్లంపెల్లి ఏరియాలోని గనులలో కార్మికులు విధులకు హాజరై నిర్దేశించిన లక్షాన్ని 90 శాతం సాదించారని తెలిపారు. మిగితా కార్మికులు కూడా విధులలో హాజరై తమ జితబథ్యాలు నష్ట పోకుండా సమస్త అభివృద్ధికి సహకరించాలన్నారు. శుక్ర మరియు శనివారము విధులు నిర్వహించిన ఉద్యగులకు ఆదివారము నాడు కూడ హాజరు వెయ్యడం కూడా జరుగుతుందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమాలు సద్వినియోగం చేసుకోవాలి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 15 (వుదయం ప్రతినిధి); పండిత్ దన్ దయిల్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవాల సందర్బంగా ప్రతి గడప గడపకు ప్రచారకార్యక్రమంలో భాగంగా గురువారం ఆసిఫాబాద్ లోని రాజంపేట కాలనిలో భాజపా మండల అధ్యక్షుడు కాండ్ర విశాల్ ప్రచారకార్యక్రమం నిర్వహించారు. మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన పథకాలను ప్రతి గడప గడపకు తెలియజేస్తుంట్లు తెలిపారు. సంక్షేమ పథకాలు ను ప్రజలు వినియోగించుకోవలని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ 3 సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకోనప్పటికీ ఇప్పటి వరకు కేంద్రా ప్రభుత్వపైన ఎటువంటి మచ్చలేదన్నారు ప్రజలు గమనించి ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికలో గణ విజయం సాదించింది అని అన్నారు. ఈ కార్యక్రంలో గుండా శంకర్, పద్మ సురేష్,స్వామి ,చరణ్ ,రాజు, లక్ష్మి నాయకులూ పాల్గొన్నారు .
వారసత్వ ఉద్యోగాలు కల్పించే వరకూ పోరాడుతాం ; సిపిఐ మాజీ ఎంఎల్ఎ గుండా మల్లేష్
వారసత్వ ఉద్యోగాలు కల్పించే వరకూ పోరాడుతాం ; సిపిఐ మాజీ ఎంఎల్ఎ గుండా మల్లేష్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 15 (వుదయం ప్రతినిధి); సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించే వరకూ కార్మికుల పక్షాన పోరాడుతామని సిపిఐ మాజీ ఎంఎల్ఎ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుండా మల్లేష్ అన్నారు.సింగరేణిలో జరుగుతున్న సమ్మె సందర్భంగా గురువారం రోజున గోలేటిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించడంలో యాజమాన్యం,టీ.ఆర్.యస్., టిబిజికెయస్ పూర్తిగా విఫలం చెందిందని ఆరోపించారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి గుర్తింపు సంఘంగా గెలిచిన టిబిజికెయస్ గ్రూపులుగా విడిపోయి డబ్బుల విషయంలో కోర్టు చుట్టు తిరుగుతూ నాలుగు సంవత్సరాలు కాలాయపన చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొదటి సంతకం వారసత్వ ఉద్యోగాల పైనే పెడుతానని హమీ ఇచ్చిన కెసిఆర్ మరచిపోయారని అన్నారు. కనీసం కార్మిక చట్టాలపై అవగాహన లేని టిబిజికెయస్ ఎఐటియుసి ని విమర్శించడం సిగ్గుచెటన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మికులు స్వచ్చందంగా సమ్మెలో పాల్గొంటే సమ్మెను విఫలం చేయాడానికి యాజమాన్యం టిబిజికెయస్ టి ఆర్ యస్ కుట్రలు పన్నుతుందని దానిని కార్మికులు గమనిస్తున్నరని అన్నారు. యాజమాన్యం ఎప్పుడు లేని విధంగా సింగరేణిలో పోలీసు బలగాలను మోహరించి కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేయిస్తుందని దీనిని సిపిఐ పార్టీ ఖండిస్తూందని అన్నారు. అరెస్టు చేసిన కార్మిక నాయకులను వెంటనే విడుదల చేసి పోలీసులను వెనక్కు పంపించాలని డిమాండ్ చేశారు. అలాగే టిబిజికెయస్ కార్మికుల పక్షామో కాదో తెలియజేయాలని, ఇప్పటికైనా వారసత్వ ఉద్యోగాల కల్పనకై జాతీయ కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెలో కలిసి రావాలని లేకుంటే టిబిజికెయస్ కు కార్మికులు తగిన బుద్ధి చేప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి బ్రాంచ్ ఇంచార్జ్ చిప్ప నర్సయ్య, నాయకులు శేషు,నర్సింగరావు,సత్యనారాయణ,ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,నాయకులు ఉపేందర్,నర్సయ్య,రవి,సాయి తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)