Wednesday, 9 September 2015

ఎ,అయ్,ఎస్,ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ

ఎ,అయ్,ఎస్,ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ



రెబ్బెనలో ఎ,అయ్,ఎస్,ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్ ఆధ్వర్యంలో అంతరాష్ట్ర రహాదారిపై విద్యార్థులతో ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఎఅయ్ఎస్ఎఫ్ జిల్లా జిల్లా ఇంచార్జ్ తిరుపతి ఎఅయ్ఎస్ఎఫ్ జెండాను ఆవిష్కరించారు. ఎఅయ్ఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని,ఫీజు రియంబర్స్ మెంట్ ను, స్కాలర్ షిప్ ను విడుదల చెయ్యాలని, పాఠశాలలు, హాస్టళ్లలో మౌళిక వసతులను కల్పించాలని డిమాండ్‌ చేశారు.విద్యార్థులు సమస్యలు పరిష్కరించే వరకు నిర్విరామంగా దశల వారిగా పోరాడతామన్నారు.  ఈ కార్యాక్రమంలో ఏ,అయ్,వై,ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బోగే ఉపెంధర్, కౌన్సిల్ సభ్యులు రవి, మండల అధ్యక్షులు పూదరి సాయి, ఏ,అయ్,టీ,యు,సి మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య, నాయకులు సతీష్, శేఖర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 8 September 2015

వారసత్వ ఉద్యోగాలు సాధిస్తాం

వారసత్వ ఉద్యోగాలు సాధిస్తాం


సింగరేణి కార్మికుల వారసత్వ ఉద్యోగాలు సాధించి తీరుతామని టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఆకనూరి కనకరాజు అన్నారు. మంగళవారం రెబ్బెన మండలంలోని  గోలేటి వన్‌ ఏ గని ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ కార్మిక సంఘాల కార్మికులు హక్కులు కోల్పోయారని ఆరోపించారు. లాభాల బోనస్‌ గురించి అడిగే హక్కు జాతీయ సంఘాలకు లేదా అన్నారు. 2014-15 సంవత్సరానికి సింగరేణి కార్మికులకు 25శాతం లాభాల వాట సెప్టెంబర్‌లో ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. సింగరేణిలో క్యాడర్‌ స్కీం రెండు నెలల్లో అమలు చేస్తామని, లోకల్‌ రిజర్వేషన్‌ కల్పిస్తామని అన్నారు. దీపావలి బోనస్‌ రూ. 75 వేలు ఇప్పిస్తామని, జాతీయ సంఘాలు తమతో కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రవీందర్‌ రెడ్డి, కోశాధికారి సారంగపాణి, ప్రతినిధి ఎల్లం గోవర్ధన్‌, శ్రీనివాసరావ్‌, సదాశివ్‌, మంగిలాల్‌, శంకర్‌, సత్యనారాయణ, సంపత్‌ కుమార స్వామి తదితరులున్నారు

ఎన్టీఆర్ కాలనీలో పురుగుల నీళ్ళు

ఎన్టీఆర్ కాలనీలో పురుగుల నీళ్ళు



మంగళవారం నాడు ఉదయం రెబ్బెనలోని ఎన్టీఆర్ కాలనీలో బొడ్డు కిష్టయ్య పలు కుళాయిలు తిప్పగా పురుగులు వచ్చాయని కాలనీవాసులు ఆవేదన చెందారు. ఈ విషయాన్నీ వార్డ్ మెంబర్ మోడెం చిరంజీవి గౌడ్ కు చెప్పగా ఆయన సర్పంచ్ పెసరు వెంకటమ్మ దృష్టి తీసుకెళ్ళారు. అనంతరం పంచాయితి కార్యదర్శి రవీందర్ మరియి ఎంపీడీవో ఎంఏ హలీం కాలనీని పరిశీలించారు. వారు మాట్లాడుతూ గత నెల 30 న ట్యాంక్ లో క్లోరినేషన్ చేపట్టామని అయినా ఇలా జరగడానికి గల కారణాలను, కాలనీలోని పైపు లైను ను పరిశీలిస్తామని, ఇటువంటి పరిస్థితి మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని తేలిపారు.

టీవీవీ సంతకాల సేకరణ

టీవీవీ సంతకాల సేకరణ



తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో రెబ్బెన మండలంలో మంగళవారం సంతకాల సేకరణ చేపట్టారు. టీవీవీ జిల్లా అధ్యక్షుడు కడతల సాయి మట్లాడుతూ ఆసిఫాబాద్‌ డివిజన్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఈ విషయంపై అధికారులకు ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోవడంలేదని ప్రభుత్వం ఈ కళాశాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. సేకరించిన సంతకాలను పై అధికారులకు అలాగే విద్యాశాఖ మంత్రులకు పంపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి జరుపుల శివాజీ, మండల కన్వీనర్‌ సాయి నవతేజ, శ్రావణ్‌, నవీన్‌, ప్రవీణ్‌, తిరుపతి పాల్గొన్నారు. 

పూలు పెట్టుకొనివినూత్న నిరసన

పూలు పెట్టుకొనివినూత్న నిరసన 



 రెబ్బెనలోని ప్రాథమిక చికిత్స కేంద్రం ముందు చేపట్టిన ఆశావర్కర్లు నిరవధిక సమ్మె మంగళవారం నాటికి ఏడవ రోజుకు చేరినందుకు చెవిలో పూలు పెట్టుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కనీస వేతనం రూ.15వేలుచెల్లించాలని, ఉద్యోగ భద్రత, పదోన్నతులు కల్పించాలని. అర్హులైన వారిని ఏ,ఎన్,ఎం లుగా గుర్తించాలని, పీ,ఎచ్,సి కు వెళ్ళిప్పుడు టీఏ.డీఏ కల్పించాలి. ఇతర బకాయులు చెల్లించాలని అన్నారు. ఈ కార్యాక్రమంలో ఆశ కార్యకర్త సీ,అయ్,టీ,యు  అధ్యక్షురాలు అనిత, కార్యదర్శి లలిత, ఉపాధ్యక్షులు రమ, ఆశ కార్యకర్తలు కవిత, నిర్మల, చాయ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు
తహశిల్దార్ కు ఆశ కార్యకర్తల వినతి పత్రం  


తమ న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని హెల్త్ వర్కర్స్ (ఆశ కార్యాకర్తలు) రెబ్బెన మండల తహశిల్దార్ రమేష్ గౌడ్ కు సోమవారం పలు డిమాండ్లతో కూడిన వినతీ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ నేటి సమాజంలో పెరుగుతున్న కూరగాయల ధరలు, నిత్యావసర వస్తువులకు అనుగుణంగా ప్రభుత్వం తమ వేతనాలను పెంచాలని, లేదంటే తమ పరిస్థితి అగమ్య గోచరంగా తయారై వీధుల పాలవుతాయని, అర్హులైన వారిని ఏ,ఎన్,ఎం లుగా గుర్తించాలని, రెబ్బెన ప్రాథమిక చికిత్స కేంద్రం ముందు ఆశ కార్యాకర్తల సమ్మె నేటికి 6 రోజులు అవుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాకపోవడం విడ్దూరంగా ఉందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. వీరికి ఏ,ఐ,టీ,యు,సీ మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య, తివీవీ జిల్లా అధ్యక్షులు కదతల సాయి మద్దతు పలికారు. ఈ కార్యాక్రమంలో ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, సుకన్య,  పద్మ, సరోజన, భాగ్య  ఆశ కార్యాకర్తలు, తదితరులు పాల్గొన్నారు.





Sunday, 6 September 2015

గోలేటిలో ఉచిత వైద్యశిబిరం

గోలేటిలో ఉచిత వైద్యశిబిరం

రెబ్బెన మండలంలోని గోలేటి ఆశ్రమ పాఠశాలలో ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిడాం సోమయ్య తెలిపారు. ఈ నెల పదవ తేదీన వరంగల్‌ లోని విజయ ఆసుపత్రి, మాధవ నర్సింగ్‌ హోం, శ్రీరామ మల్టిస్పెషాలిటీ ఆసుపత్రుల నుంచి కిడ్నిస్పెషలిస్ట్, పిల్లల వైద్యనిపుణులు డాక్టర్‌ విద్యాధర్‌, డాక్టర్‌ దీప ఆధ్వర్యంలో వైద్యశిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు  ఈ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని మండల గ్రామప్రజలు సద్వినియోగంచేసుకోవాలని కోరారు.

కొనసాగుతున్న ఆశావర్కర్ల సమ్మె

కొనసాగుతున్న ఆశావర్కర్ల సమ్మె


ఆశావర్కర్లకు కనీస వేతనం రూ.15వేలుచెల్లించాలని డిమాండ్‌ చేస్తూ రెబ్బెనలోని ప్రాథమిక చికిత్స కేంద్రం ముందు చేపట్టిన ఆశావర్కర్లు నిరవధిక సమ్మె ఆదివారం నాటికి ఐదవ రోజుకు చేరుకున్నాది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, పదోన్నతులు కల్పించాలని. అర్హులైన వారిని ఏ,ఎన్,ఎం లుగా గుర్తించాలని, పీ,ఎచ్,సి కు వెళ్ళిప్పుడు టీఏ.డీఏ కల్పించాలి. ఇతర బకాయులు చెల్లించాలని అన్నారు ఈ సమ్మే కు  తెలంగాణ విద్యార్ధి వేదిక జిల్లా అద్యక్షుడు కడతల సాయి నాయకులు రాయల నర్సయ్య  మద్దతు తెలిపి సమ్మేలో కూర్చున్నారు. ఈ కార్యాక్రమంలో ఆశ కార్యకర్తలు అధ్యక్షులు అనిత, కార్యదర్శి లలిత, ఉపాధ్యక్షులు రమ, తదితరులు పాల్గొన్నారు.


Saturday, 5 September 2015

ఘనంగా తీజ్‌ ఉత్సవాలు




తీజ్‌ ఉత్సవాలను శనివారం రెబ్బెన మండలంలోని ఖైర్‌గూడ, గోలేటిలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం యువతి, యువకులు సాంస్కృతిక నృత్యాలతో అలరించారు. జడ్పిటీసి బాబురావు ఆధ్వర్యంలో యువకులకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఘనంగా డా,సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి



రెబ్బెనలోని సాయి విద్యాలయంలో డా,సర్వేపల్లి రాధాకృష్ణన్  జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి సందర్భంగా పాటశాలలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్, జడ్పిటీసి బాబురావు, ఎంఈవో వెంకటరస్వామి, తెరాస  మహిళ ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ ముఖ్య అతిధులుగా హజరయ్యారు. అనంతరం పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశి. కరస్పాండెంట్ దీకొండ సంజీవ్ కుమార్ ను సన్మానించారు.  ఈ కార్యక్రమంలో పాటశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

పౌష్టికాహారం పై అవగాహన సదస్సు


రెబ్బెన మండలంలోగల ఎం,పీ,డీ,వో కార్యాలయం లో పౌష్టికాహారం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్ మాట్లాడుతూ కూరగాయలు, పాలు, పండ్లు, నానబెట్టిన విత్తనాలు తింటే ఆరోగ్యం బాగుటుందని, వాటి వల్ల మనకు కలిగే లాభాలను, వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యాక్రమంలో ఎం,పీ,డీ,వో ఎంఎ హలీమ్, జడ్పిటీసి బాబురావు, ఎపీఎమ్ వెంకటరమణ, సీడిపివో మమత, సర్పంచ్ పెసరు వెంకటమ్మ, అంగన్వాడి కార్యాకర్తలు పాల్గొన్నారు

బొగ్గు లారీలో టేకు దుంగలు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్



రెబ్బెన మండలంలోని గోలేటి శివారులోగల నాలుగు స్తంభాల కూడలిలో బొగ్గు లారీలో(ఏపి15టేఏ4751) అక్రమంగా తరలిస్తున్న 26 టేకు దుంగలను శనివారం రాత్రి 1.30 గంటలకు డీఎఫ్‌వో వెంకటేశ్వర్లు తెలిపిన సమాచారం మేరకు స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులో తీసుకున్నట్లు రేంజ్ ఆఫీసర్ వినయ్ కుమార్ కుమార్ సాహు తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. అక్రమంగా తరలిస్తున్నట్లు ఈ టేకు దుంగల విలువ 62 వేలని లారీ డ్రైవర్,క్లీనర్ ను పట్టుకుని వారిపై కేసులు నమోదు చేశామని, కలపతో కూడిన బోగ్గు లారీని సీజ్‌ చేశామని పేర్కొన్నారు. కలప దొంగలపై నిఘా ఉంచుతామని తెలిపారు. ఈ సమావేశంలో డీవైఆర్వో శ్రీనివాస్‌, బీట్‌ అధికారులు సతీష్, వెంకటస్వామి,రామయ్య, ఎండీ షరీఫ్‌, లత, రవి అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Friday, 4 September 2015

గ్రామాల సంక్షేమం కోసం అందరు సహకరించాలి--తహశిల్దార్

గ్రామాల సంక్షేమం కోసం అందరు సహకరించాలి--తహశిల్దార్

మండల ప్రజలు అందరు సహకరించాలని రెబ్బెన మండల తహశిల్దార్ రమేష్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా తహశిల్దార్ మాట్లాడుతూ గ్రామాల సంక్షేమం కోసం, పారిశ్యుద్ధం కోసం, వైకుంటదామం కోసం ప్రభుత్వ భూముల వివరాలు గురించి తెలుసుకునేందుకు వారి వద్దకు వచ్చే పట్వారీలకు మరియు సర్వే అధికారులకు ప్రజలు అందరు సహకరించాలని, అలాగే  ఎవరైనా వైకుంటదామం కోసం దాతలు భూదానం చేసేందుకు ముందుకు రావాలని, కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయని ఎవరైనా చనిపోయిన వారు ఉంటె డీలర్ కు వివరాలు తెలియజయాలని కోరారు.