రెబ్బెన ఏప్రిల్ 30: ఆసిఫాబాద్ సబ్-కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు గురువారం నాడు రెబ్బెన మండలం లోని రాజారం, కిస్టాపూర్, నారాయణపూర్ గ్రామాలలో తిరిగి పలు భూములను పరిశీలించినారు, కిస్టాపూర్ లో 16 ఎకరాలు, రాజారం లో 6 ఎకరాలు, నారాయణపూర్ లో 10 ఎకరాలు సుమారు మొత్తం 32 ఎకరాలు పట్టెధారుల భూములను పరిశీలించినారు, పట్టేధారులు ఇస్తాపడినట్లైతే వారికీ మార్కెట్ ధర చెల్లించి ఆ భూములను భూమి లేని దళిత కుటుంబాలకు 3 ఎకరాలు చొప్పున పంపిణి చేయనునట్లు తహసిల్దార్ జగదిశ్వరి తెలిపారు, ఈ సందర్భంగా సబ్-కలెక్టర్ వెంట రెబ్బెన తహసిల్దార్ జగదిశ్వరి మరియు పలువురు గ్రామస్తులు పాలుగోన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Thursday, 30 April 2015
భారీ ఈదురు గాలులు వలన నష్టపోయిన రైతులు
రెబ్బెన, ఏప్రిల్ 27 (వుదయం ప్రతినిధి):రెబ్బెన మండలంలో ఆదివారం రాత్రి భారీ ఈదురు గాలులతో
పాటువడగళ్ల వర్షం కురిసింది. భారీ ఈదురు గాలుల వలన మండల కేంద్రంలో ఇండ్లపై ఉన్న రేకులు గాలికి లేచిపోయి తీవ్రనష్టాన్ని కలిగించాయి. మండల కేంద్రంలోని వైన్ షాప్ ప్రక్కన గోడ కూలి షాప్ మీద పాడడం తో షాప్ లో పనిచేస్తునా ఒక వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి, అకాల వర్షం వల్ల మామిడి రైతులకు తీవ్ర నష్టం మిగిల్చాయి. ఈదురుగాలుల వల్ల విద్యత్ స్తంబాలు నెలకొరగడంతో విద్యత్ అంతరాయం ఏర్పడి మండలంలోని గ్రామాలు ఆదివారం రాత్రాంత ప్రజలు అంధాకారంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
భారీ బహిరంగ సభకు తరలివేల్లిన తెరాస నాయకులూ
.
రెబ్బెన, ఏప్రిల్ 27 (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలంలోని సోమవారం నాడు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు మండలం నుండి భారీ ఎత్తు నాయకులు తరిలారు. తరలిన వారిలోజడ్పీటీసీ బాబురావ్, ఎంపీపీ సంజీవ్‌కుమార్, రెబ్బెన సర్పంచ్ వెంకటమ్మ, పార్టీ ఇతర నాయకులూ రెబ్బెన గ్రామా పార్టీ అధ్యక్షుడు రాపర్తి, అశోక్,సత్తన్న, బొమ్మినేని సత్యనారాయణ, మోడెం చిరంజీవి గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ మదనయ్య కార్యకర్తలు తదితరులున్నారు.
ఎన్ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గా రెండవ సారి ఎన్నికైనా దుర్గం భరద్వాజ్
ఎన్ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గా రెండవ సారి ఎన్నికైనా దుర్గం భరద్వాజ్
రెబ్బెన,ఏప్రిల్23(వుదయం ప్రతినిధి):రెబ్బెన మండల కేంద్రానికి చెందినా దుర్గం భరద్వాజ్ కాంగ్రెస్ పార్టి అనుబంధ విద్యార్ధి విభగమైన ఎన్ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గా రెండవ సారి ఎన్నికయ్యారు కరీంనగర్ లోని కాంగ్రెస్స్ పార్టి కార్యాలయం లో ఈ నెల 13 న జరిగిన ఎన్ఎస్ యు ఐ ఎన్నికల్లో దుర్గం భరద్వాజ్ రెండవ సారి ఎన్నికయ్యారని రాష్ట్ర అద్య క్షుడు బాలమురి వెంకట్ ప్రకటించారు రెబ్బెన లో దుర్గం భరద్వాజ్ విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులు సమస్యల పరిష్కరం కోసం ముందుండి పోరాటాలు సాగిస్తామన్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి దక్కటనికి కృషిచేసిన రాష్ట్ర అద్య క్షుడు బాలమురి వెంకట్ , మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు , ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి సంతోష్ , జిల్లా అద్య క్షుడు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు .
తెలుగుదేశం యువజన సంఘం కమిటి ఏర్పాటు
రెబ్బెన,ఏప్రిల్23(వుదయం ప్రతినిధి): తెలుగుదేశం యువజన సంఘం కమిటిని గురువారం ఏర్పాటు చేశారు. పట్టణ యూత్ అధ్యక్షులుగా భార్గవ్‌గౌడ్, ఉపాధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి శ్రావణ్, కార్యదర్శి సంతోష్, కోశాధికారి మెడ రాఖేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా తాళ్లపెల్లి కార్తీక్, విహార కార్యదర్శి శ్రీకాంత్ లు ఎన్నికయ్యారు అని మోడం సుదర్శన్ గౌడ్ ప్రెస్ మీట్లో చెప్పారు.
రైతులకు నీటి వసతి కొరకై
రెబ్బెన : మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో రైతులకు నీటి వసతి కొరకై స్పింక్లర్ల పైపులు ఎంపీ డీవో అలీం శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు స్పింకర్లను ద్వారా మొక్కలకు, పంటలకు అవసరమయ్యే నీరు సక్రమంగా అందుతుందన్నారు. నీటి వృధాను అరికట్టవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంజీవ్ కుమార్, జెడ్పీటీసీ బాబురావ్, రెబ్బెన సర్పంచ్ వెంకటమ్మ, సర్పంచ్ సుశీల, నాయకులు వెంకటేష్, చిరంజీవి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలు
రెబ్బెన : హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాల కు మండలంలోని టీఆర్‌ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి , మండల అధ్యక్షుడు సంజీవ్‌కుమార్, జడ్పీటీసీ బాభూరావు, పార్టీ నాయకులు దుర్గం పోచయ్య, చిరంజివీ గౌడ్, మదనయ్య, శంకరమ్మ పాల్గొన్నారు.
రేషన్ షాపు కొరకు వినతి
రెబ్బెన,ఏప్రిల్23(వుదయం ప్రతినిధి): - మండల కేంద్రంలో గురువారం రోజున తహసిల్దార్ కార్యాలయంలో కైర్గాం ప్రజలు , ప్రతినిధులు కైర్గాం గ్రామ పంచాయతీలో ఉన్న రేషన్ షాపు తీసివేసి పక్క ఎడవేల్లిలో రేషన్ షాపు నిర్వహించడంతో కైర్గాం నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉండటంతో ప్రధాన రహదారి గుండా నడుస్తూ వెళ్లాలంటే ఇబ్బందులకు గురవుతున్నామని గతంలో కూడ సబ్‌కలెక్టర్‌కి వినతిపత్రం అందించామని సింగిల్ విండో డైరెక్టర్ మారం సంతోష్, వార్డు సభ్యులు గౌరక్క తహసిల్దార్ జగదీశ్వరికి విన్నవించారు. తహశీల్దార్ గారు మాట్లాడుతూ సమస్యకు పరిష్కారాన్ని అధికారులతో మాట్లాడుతానన్నారు. ఈ కార్యక్రమంలో బండి శకుంతల, పోషక్క, రాజన్న, సంతోష్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాలుగోన్నారు
ప్రాధమిక పాఠశాలలో నూతన భవన నిర్మాణాని భూమి పూజ
రెబ్బెన,ఏప్రిల్23(వుదయం ప్రతినిధి):రెబ్బెన మండలంలోని సబ్‌స్టేషన్ వద్ద ఉన్న ప్రాధమిక పాఠశాలలో నూతన భవన నిర్మాణానిక ఎంపీపీ సంజీవ్‌కుమార్ భూమి పూజ నిర్వహించారు. రూ. 6 లక్షల వ్యయంతో ఈ భవన నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బాబురావ్, రెబ్బెన గ్రామసర్పంచ్, ఉపసర్పంచ్, పాఠశాల చెర్మన్, సింగిల్ విండో డైరెక్టర్, మాజీ ఎంపీపీ, ఏఈ, కాంట్రాక్టర్ వెంకట స్వామి,సంజీవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నూతన సైడ్ డ్రైన్ పనులు ప్రారంభోత్సవం
రెబ్బెన,ఏప్రిల్22(వుదయం ప్రతినిధి):రెబ్బెన - మండలంలోని వార్డ్ నెంబర్ 6 నూతన సైడ్ డ్రైన్ ను గ్రామసర్పంచ్ పెసరు వెంకటమ్మ చేతుల మీదుగా ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో వైస్ యం.పి.పి. రేణుక, ఉప సర్పంచ్ శ్రీధర్ కుమార్, వార్డ్ మెంబెర్లు చిరంజీవి గౌడ్, తిరుపతి, దుర్గం బరద్వాజ్ ఇతర నాయకులూ నవీన్ కుమార్ జైస్వాల్, తెదేపా నాయకులు సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నూతన బోరు ప్రారంభోత్సవం
నిధుల దుర్వినియోగం పై సర్పంచ్ ను నిలదిసిన ప్రజలు
రెబ్బెన మండలం లోని నారాయణపుర్ గ్రామాపంచాయితికి వచ్చిన నిధుల దుర్వినియోగం గురించి నారాయణపూర్ ఉప సర్పంచ్ఎరువోతుల పద్మ సర్పంచ్ ను మరియు సెక్రటరి ని గ్రామా సభలో అడగగా, తన వద్ద ఎటువంటి లెక్కలు లేవని, గత సెక్రెటరి తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు అని నిర్లక్ష్యంగా సమాదానం చెప్పారని ప్రజలు నిరసన తెలిపారు, దీనికి స్పందించి సెక్రెటరి మే 5న గ్రామా సభ పెట్టి నిధుల విషయం చెప్పుతానని హామీ ఇవ్వడంతో సభ్యలు, ప్రజలు నిరసన విరమించారు, గ్రామం లో గత 2 సంవత్సరాలనుండి ప్రజలకు త్రాగడానికి సురక్షిత మంచినీరు లేదు అని దీని పై జిల్లా స్థాయి అధికారులు స్పందించాలని ప్రజలు కోరారు.
టీఆర్‌ఎస్ తూర్పు జిల్లా అధ్యక్షునిగా మూడవసారి ఎన్నిక
రెబ్బెన, ఏప్రిల్ 17 (వుదయం ప్రతినిధి): టీఆర్‌ఎస్ తూర్పు జిల్లా అధ్యక్షునిగా మూడవసారి ఎన్నికైన పురాణం సతీష్‌ను శుక్రవారం రెబ్బెన లో టీఆర్‌ఎస్ నాయకులు , కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవలక్ష్మీ, మాట్లాడుతూ తూర్పు జిల్లా లో పురాణం సతీష్ గారి అద్వర్యంలో పార్టీ ఇంకా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు, తూర్పు జిల్లా ఉప అధ్యక్షుడు నవీన్ కుమార్ జైస్వాల్, పురాణం సతీష్‌ను పూలమాలతో సత్కరించారు, ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాబురావ్, ఎంపీపీ సంజీవ్‌కుమార్, రెబ్బెన సర్పంచ్ వెంకటమ్మ, పార్టీ ఇతర నాయకులూ రెబ్బెన గ్రామా పార్టీ అధ్యక్షుడు రాపర్తి అశోక్, బొమ్మినేని సత్యనారాయణ, మోడెం చిరంజీవి గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ మదనయ్య కార్యకర్తలు తదితరులున్నారు.
Subscribe to:
Posts (Atom)