Thursday, 7 September 2017

 సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష 

 సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష 


 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  సెప్టెంబర్ 07 ;    బెల్లంపల్లి  ఏరియా సింగరేణిలో అక్టోబర్ ఐదవ తేదీన జరిగే  గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల ఏర్పాట్లపై అసిస్టెంట్ లేబర్ కమీషనర్  ఎం  ,ఆర్ ఎల్ సాహు ఆధ్వర్యంలో  లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ రమేష్,బెల్లంపల్లి ఎస్ ఓ టు  జి ఎం కొండయ్య,బెల్లంపల్లి ఏరియా ఎన్నికల సమన్వయ కర్త చిత్తరంజన్ కుమార్  లు బెల్లంపైల్ ఏరియా లోని ఇవిద గనులలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించి తగిన సూచనలు ఇచ్చ్చారు. ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ కిరణ్, డీ ఫై పి   ఎం   సుదర్శనం  పాల్గొన్నారు.

పార్టీలకతీతంగా రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలి 

పార్టీలకతీతంగా రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలి 


 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  సెప్టెంబర్ 07 ;     పార్టీలకతీతంగా రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని రెబ్బెన మండల తుంగేదా గ్రామ రైతులు గురువారం రెబ్బెన ఉప  తహసీల్దార్  విష్ణు కు  వినతిపత్రం అందచేసి అనంతరం మాట్లాడుతూ . గ్రామకమిటీ లనియమాకం కేవలం టి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులకు మాత్రమే అన్నట్లుగా తమపార్టీ వారినే ఎన్నుకున్నారని, ఇది రాజ్యాంగస్ఫూర్తికి పూర్తిగా వ్యతిరేకమని, ముందుగా గ్రామసభ నిర్వహించి పార్టీలకతీతంగా సభ్యులను ఎన్నుకొని  కమిటీ  నియామకం చేయాలనీ రైతులు కోరారు. ఇలా చేయని పక్షంలో ఆందోళన బాట పడతామనితెలిపారు. ఈ కార్యక్రమంలో తుంగేదా గ్రామరైతులు పూదరి హరీష్,పూదరి శ్రీకాంత్,రాచకొండ రాజు, భామిని శ్రీనివాస్,డోంగ్రి మహీధర్,తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడిల సమస్యలపై తహసీల్దార్ కు వినతిపత్రం

అంగన్వాడిల సమస్యలపై తహసీల్దార్ కు వినతిపత్రం



  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  సెప్టెంబర్ 07 ;  తెలంగాణ ఆఅంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్సి ఐ టి యూ  రెబ్బెన మండల కమిటీ త మసమస్యలపై సి ఐ టి యూ జిల్లా అధ్యక్షులు అల్లూరి లోకేష్  ఆధ్వర్యంలో రెబ్బెన తహసీల్దార్ కు    వినతిపత్రం అందచేశారు. వినతిపత్రంలో అంగం వాడి ఉద్యోగులు గత నలభై సంవసరాలుగా చాలీచాలని జీతాలతో,దుర్భర జీవితంగ్గడుపుతూ, సమాజానికి తమవంతు సేవచేసారని, వారి సేవలను గుర్తించకుండా  ఇప్పుడు ప్రభుత్వం  కేవలం అరవైవేలు, ముఫైవేలు   వన్ టైం  సెటిల్మెంట్ కింద  ఇచ్చి ఇన్నేళ్ళుగా సేవలందించిన అంగం వాడి వర్కర్లను ఇంటికి సాగనంపాలనుకుంటున్నారని ,గ్రేటుఇటై చట్టం ప్రకారం ప్రతి సర్వీస్ సంవత్సరానికి పదిహేను రోజుల వేతనాన్ని లెక్కకట్టి  ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు లక్షలరూపాయలు వస్తాయని, పెన్షన్ కూడా చివరి నెల జీతంలో సగం ఉండాలని డిమాండ్ చేసారు. పనిభారం పెంచడానికి రేషన్ దుకాణాలద్వారా అంగం వాడి లు   సప్లై    నిర్యాణాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన మండల కమిటీ సభ్యులు చంద్రకళ, ప్రమీల, సంధ్య, బాలమ్మ, భారతి, సుశీల, రాజేశ్వరి, మంజుల, శోభారాణి, అమృత, నిర్మల, స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు.

సింగరేణిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతాం                                ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి 

సింగరేణిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతాం 
                              ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి 



 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  సెప్టెంబర్ 07 ;  సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో ఉపరితల గనులను   ప్రైవేటీకరణ  చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఏఐటీయూసీ  గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి ఆరోపించారు.గురువారం బెల్లంపల్లి ఏరియాలోని కైరగూర ఓపెన్ కాస్ట్ లోని వర్క్ షాప్ కార్మికులను ఉద్ధ్యేశించి తిరుపతి మాట్లాడుతు తాడిచర్ల గనిని ప్రైవేటీకరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వా  మెప్పు కోసం సింగరేణి సంస్థ సిఎస్ఆర్ నిధులను సింగరేణికి సంబంధం లేని ప్రాంతాలైన గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్ల, నిజామాబాద్, హైదరాబాద్ లలో ఖర్చు పెడుతు  సింగరేణి కార్మికులకు తీవ్రని అన్యాయం చేస్తుందని అన్నారు.  కార్మిక వర్గం ఏఐటీయూసీని ఆదరించి నక్షత్రం (చుక్క) గుర్తుకు ఓటు వేసి బారీ  మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు చేసారు .ఏఐటీయూసీ గుర్తింపు   సంఘంగా గెలవగానే వారసత్వ ఉద్యోగ హాక్కును సాధిస్తామని, కార్మికుల స్వంతింటి కళను  నెరవేరుస్తామని అన్నారు. కార్మిక వర్గాన్ని మోసం చేసిన టీబీజీకేఎస్ ను చిత్తు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలని అయన అన్నారు.ఈ సమావేశంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు ముచ్చర్ల మల్లయ్య,పేరం శ్రీనివాస్, ఏఐటీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షులు బయ్యా మొగిలి,ఫిట్ కార్యదర్శి జూపాక రాజేష్, సహాయ ఫిట్ కార్యదర్శి దివాకర్,ఆర్గనైజింగ్ర్శు కార్యదలు సోకాల శ్రీనివాస్, ఎం.లక్ష్మీనారాయణ, నాయకులు కిరణ్ బాబు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Wednesday, 6 September 2017

పిడుగు పాటుకు ఒకరు మృతి

పిడుగు పాటుకు ఒకరు మృతి 


     కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  సెప్టెంబర్ 06:  రెబ్బెన   మండలంలోని ఖైర్గం  గ్రామంలో  నాయిని పోచయ్య (50)అనే వ్యక్తి పిడుగు పోటుకు మృతి చెందాడు. ఈమేరకు రెబ్బెన ఎసై నరేష్ కుమార్  పంచనామా నిర్వహించారు.  సంఘటన స్థలానికి  సర్పంచ్ సులోచన,  మాజీ సర్పంచ్ వెంకటేష్ తదితరులు చేరుకొని చేరుకొని సందర్శించరు . మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. 

అధికారుల నిర్లక్ష్యం వాళ్ళ లబ్దిదారురులకు ఇబ్బందులు

అధికారుల నిర్లక్ష్యం వాళ్ళ లబ్దిదారురులకు  ఇబ్బందులు 


    కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  సెప్టెంబర్ 06:     ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పథకాలను చేపడుతున్నప్పటికీ  కొందరి  అధికారుల నిర్లక్ష్యం వాళ్ళ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అన్నారు. వాంకులం మాజీ సర్పంచ్ జాదవ్ ప్రేమ్  దాస్ అన్నారు. బుధవారం రెబెనా మండలం  ఎంపిడిఓ కార్యాలయంలో వినతి పత్రం అందచేశారు.అనంతరం  మళ్లాడుతూ  వితంతు పింఛన్లు, వృద్ధ్యాప్య పింఛన్ లు  పై కలెక్టర్ కు  దరఖాస్తులు చేసుకున్నారని ఆయన స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో గతంలో ఎన్నిసార్లు దరఖాస్తు  చేసుకున్న సదరు అధికారులు పట్టించు కోవడం లేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిప్రి సంత, జబోరే తారాబాయి,బోయిరి నాగుబాయి, కంటే మిట్టబాయి,  బి నిర్మల తదితరులు ఉన్నారు.   

తెరాస అభివృద్ధి ఓర్వలేక కాంగ్రేస్ నాయకులూ ఆరోపణలు మానుకోవాలి. పోటు శ్రీధర్ రెడ్డి

తెరాస అభివృద్ధి  ఓర్వలేక కాంగ్రేస్ నాయకులూ ఆరోపణలు మానుకోవాలి. పోటు శ్రీధర్ రెడ్డి 

 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  సెప్టెంబర్ 06: తెరాస చేస్తున్న అభివృద్ధి పనులు ఓర్వలేక  కాంగ్రేస్ పార్టీ నాయకులూ తప్పుడు ఆరోపణలు చేయటం తగదని తెరాస పార్టీ మండల అధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి అన్నారు. బుధవారం రెబ్బెన అతిధి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి  రాబోయే రోజుల్లో పుట్ట గతులు ఉండవని, తెరాస ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చెయ్యడం సరికాదని  అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న రైతు సమన్వయ కమిటీ లలో  గ్రామాల్లో రైతులు స్వచ్చందంగా  పాల్గొంటున్నారని అన్నారు. రైతులకు ఖరీఫ్, రబీ ఎకరానికి ఎనిమిది వేల  చొప్పున పెట్టుబడి పథకాన్ని అమలు చేస్తున్నారు..  ప్రభుత్వం  పై చౌకబర విమర్శలు,అసత్యపు ఆరోపణలను మానుకోవాలని లేని పక్షం లో రాబోయే రోజాల్లో ప్రజలు,రైతులే బుద్ది చెప్తారని అన్నారు. గతంలో కాంగ్రేస్ పార్టీ చేసింది ఏమి లేదు అని రాబోయే రోజుల్లో పార్టీ ఉనికి కోసమే ప్రజల్లో చౌకబార  మాటలు చెప్తున్నారు అన్నారు.ఈ సమావేశంలో గంగాపూర్  ప్రధాన కార్యదర్శి  పందిర్ల మాదానయ్య, రైతులు లెండుగురే జైయరం,వాడై అరుణ్ కుమార్, ఆర్  రాజమౌళి,ఏన్  విలాస్ తదితరులు ఉన్నారు. 

Tuesday, 5 September 2017

క్రమ శిక్షణ తో చదవాలి - సర్పంచ్ వెంకటమ్మ

క్రమ శిక్షణ తో చదవాలి - సర్పంచ్ వెంకటమ్మ 

 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  సెప్టెంబర్ 05 ; విద్యార్థులు క్రమశిక్షణ తో చదవాలని , ఉన్నత  శిఖరాలను అధిరోహించ వచ్చ్చని రెబ్బెన గ్రామ సర్పంచ్ పెసర వెంకటమ్మ అన్నారు . రెబ్బెన లోని సాయి విద్యాలయం (ఎస్ వి )ఇంగ్లిష్ మీడియం హై  స్కూల్ లో నిర్వహించిన  ఉపాధ్యాయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు . విద్యార్థులు చదువు చెప్పే గురువులను , పెద్దలను గౌరవించాలనిచదువులో రాణించాలని పేర్కొన్నారు . సాయి విద్యాలయం యాజమాన్యం  విద్యార్థులను  అన్ని రంగాలలో మండలములో ముందంజలో ఉంచుతున్నందులకు ప్రత్యాక అభినందనలు తెలిపారు . అనంతరము ఉపాధ్యాయులుగా రాణించిన విద్యార్థులకు సర్పంచ్ వెంకటమ్మ, రిటైర్డ్ హెడ్మాస్టర్  చంద్రయ్యలు బహుమతులను  అందజేశారు . ఈ కార్య క్రమములో రిటైర్డ్  ప్రధానోపాద్యాయులు మూలస్తం చెంద్రయ్య , పాఠశాల ప్రధానోపాధ్యాయులు దీకొండ సంజీవ్ కుమార్ , కరస్పాండెంట్ దీకొండ విజయ కుమారి , ఉపాధ్యాయులు సుజాత , విద్యాసాగర్ , రేష్మ , విష్ణు , లీల, రాజకుమార్  , ఉదయ , శ్రీ హర్ష ,మహేందర్ , విద్యార్థులు ఉన్నారు . 

రైతు సమన్వయ కమిటీల ఏర్పాటులోరాజకీయ దురుద్దేశాలు

రైతు సమన్వయ కమిటీల ఏర్పాటులోరాజకీయ దురుద్దేశాలు  
    కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  సెప్టెంబర్ 05 :   ప్రభుత్వం కొత్తగాతలపెట్టిన గ్రామా రైతు సమన్వయ కమిటీల నియమాకంలో రాజకీయ దురుద్దేశాలున్నాయని రెబ్బెన మండల ఎం పి  టి సి కోవూరు శ్రీనివాస్ ,గంగపుర్  సర్పంచ్ ముంజం  రవీందర్ ,కాంగ్రెసుపార్టీ మజి  ఉపాధ్యక్షులు అజ్మిరా  బలరాం నాయక్  లు అన్నారు. రెబ్బెన మండలం గోలేటి లో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతూ గ్రామకమిటీల నియామకం పార్టీలకు ఆతీతంగా జరగాల్సి ఉండగా కేవలం టి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులనే పిలిచి రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ పునరావాసం కోసం చేస్తున్న ప్రక్రియగా నిర్వహిస్తున్నారని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు,గిరిజనులకు హక్కుపత్రాలు,రైతులకు ఒకేదఫా రుణమాఫీ వంటి పథకాలలో ఎంతో   పారదర్శకత పాటించిందని  గుర్తుచేశారు. టి ఆర్ ఎస్ పార్టీ శ్రేణీలలో వస్తున్నా అసమ్మతిని చల్లార్చడానికి ఈ ప్రక్రియ చేపట్టారని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటె గ్రామసభలు ఏర్పాటుచేసి పార్టీలకు అతీతంగా సమన్వయ సంఘాలను ఏర్పాటుచేయాలని అన్నారు.  ఈ సమావేశంలో భిక్ఖు నాయక్, దుప్ప నాయక్, భీం పటేల్ ,గాజుల రవీందర్,  వెంకటేశం. అనిసెట్టి వెంకన్న, సంగం బానయ్య, మధుకరగౌడ్, సంతొహ్, లష్మినారాయణగౌడ్, లక్సమయ్య  తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గురుపూజోత్సవం

ఘనంగా గురుపూజోత్సవం 

  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  సెప్టెంబర్ 05 :   రెబ్బెనలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలు ఉన్నతపాఠశాలు మరియు పాఠశాలల లో  ఈ రోజు గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు  భారతరత్న   శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని స్మరించుకొని  ఆయన జీవితాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు   తన ఇరవైఒక్కటవ యేట ప్రొఫెసర్ గా  తన ఉద్యోగజీవితాన్ని ప్రారంభించి భారత ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఈ దేశానికీ సేవలందించడమే కాకుండా  విద్యాసంస్కరణలపై ద్రుష్టి పెట్టి పలు సూచనలు చేసారు. ఆయన సేవలను గుర్తించి ప్రతియేటాఆయన జన్మదినమైన  సెప్టెంబర్  ఐదవ తారీఖున టీచర్స్ డే గ నిర్వహించుకుంటున్నాము. 

సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీనే గెలిపించండి


సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీనే గెలిపించండి
  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  సెప్టెంబర్ 05 :    సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ నే గెలిపించాలని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి, ఐఎన్టీయూసీ  ఏరియా ఉపాధ్యక్షుడు ముచ్చెర్ల మల్లయ్యలు కార్మికులను కోరారు. మంగళవారం బెల్లంపల్లి  ఏరియా డోర్లి  ఉపరితల గనిలో కార్మికులను కలిసి వారితో మాట్లాడారు.ఈ సందర్బంగా ఏఐటీయూసీ నాయకుడు ఎస్.తిరుపతి మాట్లాడుతు సింగరేణిలో ఏఐటీయూసీని ఆదరించి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కార్మికులను ఆయన కోరారు.ఏఐటీయూసీ గెలుస్తేనే అనేక హక్కులను సాధించుకోవచ్చని అన్నారు. ప్రభుత్వాలకు తొత్తులుగా వ్యవహరించే ప్రాంతీయ సంఘాలకు బుద్ధి చెప్పాలని అన్నారు.ఇంటాక్ నాయకుడు మల్లయ్య  మాట్లాడుతు తమ పూర్తి మద్దతు ఏఐటీయూసీకేనని  స్పష్టం చేసారు.ఈ సమావేశంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు చుంచు రాజన్న,ఓసిపిల ఇంచార్జి ఎం.లక్ష్మి నారాయణ,శ్రీనివాస్,నరసింహ్మ రావు  తదితలు పాల్గొన్నారు. 

అమరజీవి కొమురయ్యకు ఘన నివాళి

 అమరజీవి కొమురయ్యకు ఘన నివాళి  
            
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  సెప్టెంబర్ 05 : ;   సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక నాయకుడు, సింగరేణి కార్మికుల గుండెల్లో చిరకాలం నిలిచిపోయిన ఏఐటీయూసీ దివంగత  కార్మిక నేత మనుబోతుల కొమురయ్య 21వ వర్ధంతి సందర్బంగా మంగళవారం గోలేటిలోని కేఎల్ మహేంద్ర భవన్ లో ఏఐటీయూసీ నాయకులు ఘన నివాళ్లు  అర్పించారు. ఈ సందర్బంగా ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి  ఎస్.తిరుపతి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల హక్కుల కోసం అహర్నిశలు కృషి చేసి, వివిధ హక్కులను సాధించిన  మహానేత కొమురయ్య అని ఆయన కొనియాడారు.  సింగరేణిలో అణా పైసా జీతం నుండి వెయ్యిల రూపాయలు  జీతం పెరగడం కోసం  కొమురయ్య  చేసిన  పోరాటం ఫలించి సమాన పనికి సమాన జీతం హక్కును సాధించి పెట్టిన మహా ఉద్యమ నాయకుడు కొమురయ్య  అని అన్నారు. దాన్ని ఇప్పటికి కార్మిక వర్గం మదిలో పదిలంగా పెట్టుకుందని తిరుపతి అన్నారు. ఈ  కార్యక్రమంలో   ఏఐటీయూసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి బి.జగ్గయ్య,ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు బోగే ఉపేందర్, రాయిళ్ల నర్సయ్య, అంబేడ్కర్, సంపత్, ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్, నాయకులు పడాల సంపత్, రాజేష్, కిరణ్, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.

Monday, 4 September 2017

రైతు సమస్యల పరిష్కారంకోసం  రైతు సమన్వయ కమిటీలు

రైతు సమస్యల పరిష్కారంకోసం  రైతు సమన్వయ కమిటీలు  

 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ;  గ్రామాలలో రైతులుఎదుర్కుంటున్నఅనేకసమస్యలకు గ్రామ రైతు సమన్వయ కమిటీలు పరిష్కారం చూపుతాయని ఎం ఎల్ సీ  పురాణం సతీష్ కుమార్  అన్నారు, రెబ్బెన మండలం కిష్టాపూర్,నార్లాపూర్, గంగాపూర్ , తుంగేడ  నవేగం, రెబ్బెన గ్రామాలలో పర్యటించి రైతు సమన్వయ కమిటీలపై అవగాహన కల్పించారు. ప్రతి గ్రామం,జిల్లాల వారీగా సమన్వయకమిటీలు ఏర్పాటుచేసుకున్నట్లైతే పంటలపై అవగాహనపెరుగుతుందని ,ఒకే  పంట కాకుండా వివిధ రకాల  అధిక  దిగుబడినిచ్చే పంటలను వేసుకోవచ్చని అన్నారు. రైతుల సంక్షేమం కోసం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రాజెక్టులు, ఎకరానికి నాలుగువేల రూపాయలు వంటి పథకాలతో రైతులకు వ్యవసాయం భారం కాకుండా టి ఆర్ ఎస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా నిలిచిందని  చెప్పారు. .పండించిన పంటలకు  ,తగిన గిట్టుబాటు ధరలను కల్పించుకోవడలోను ఈ రైతు  సమన్వయ కమిటీలు ఎంతో  ప్రాధాన్యం వహిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఎం పి  పి  సంజీవకుమార్, జెడ్ పి  టి సీ   బాబు రావు ,  ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్  కుందారపు శంకరమ్మ , మండల టి ఆర్ ఎస్ అధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి , ఆయాగ్రామాల సర్పంచులు తదితర నాయకులూ,గ్రామాల రైతులు పాల్గొన్నారు.  .