కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Saturday, 8 July 2017
సమిష్టి కృషితో ఆదర్శ గ్రామం గా తీర్చి దిద్దుదాం ; డీపిఓ గంగాధర్ గౌడ్
హరితహారం లో అందరూ పాలుపంచుకోవాలి ; జీఎం రవిశంకర్
Friday, 7 July 2017
రైతులు పంటలపై బీమా తప్పనిసరి చేయిచాలి
రైతులు పంటలపై బీమా తప్పనిసరి చేయిచాలి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూలై 07 (వుదయం ప్రతినిధి) ; రైతులకు పంటలపై బీమా తప్పనిసరి చేయించాలని డివిజన్ వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు శుక్రవారం రెబ్బన మండలం లోని గంగాపూర్ లో పంటల బీమా వలన ప్రయోజనాల గురుంచి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి ప్రవేశ పెట్టిన ఫసల్ భీమా పథకాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు. ఖరీఫ్ సీజన్ లో సాగు చేస్తున్నటువంటీ వరి, జొన్న మక్కజొన్న, కంది, పెసర, పత్తి, సోయాబీన్ పంటలకు ఫసల్ భీమా పథకంలో ఈ నెల 31వరకు పంట భీమా చేసుకోవచ్చని తెలిపారు ఏలంటి ప్రకృతి వైపరీత్యాల వాళ్ళ సరైన దిగుబడి రాణి యడల ఈ పథకం లో భీమి చేసిన వారికీ ప్రభుత్వం తరఫు నుంచి కొంత మోతాదుకిలో ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ రవీందర్ . ఉపసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ . మండల వ్యవసాయ అధికారి మంజుల, ఏఈఓ మార్క్ బిటిఎం గురుమూర్తి , తదితరులు పాల్గొన్నారు.
రహదారి సమస్యను పరిష్కరించాలని వినతి
రహదారి సమస్యను పరిష్కరించాలని వినతి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూలై 07 (వుదయం ప్రతినిధి) ; రెబ్బెన మండలంలోని కొండపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రాంపూర్,నవేగం గ్రామాలకు వెళ్లే రహదారిని కొంతమంది కబ్జా చేసి,ఆ భూమిని కోల్డ్ స్టోరేజ్ భవనం నిర్మించారని దాని వల్ల గ్రామంలోకి వెళ్లాలంటే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంతున్నామని రాంపూర్,నవేగం,కొండపల్లి గ్రామాల ప్రజలు శుక్రవారం రెబ్బెన తహశీల్ధార్ కార్యాలయంలోని రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ చౌహన్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా గ్రామస్థులు మాట్లాడుతు గత కొన్నేళ్ల నుండి మూడు గ్రామాల ప్రజలం కోల్డ్ స్టోరేజ్ భవనం నిర్మించిన స్థలంలో పశువులు పోవుటకు సదరు ఉండేదని,అట్టి సదరు భూమిని కొందరు అన్యాయంగా ఆక్రమించడంతో పశువులను మేపుటకు తీవ్ర ఇబ్బంధులు పడుతున్నామని ,అక్కడ జరిగిన ఆక్రమణ,కబ్జాను గుర్తించి,వారి పై చట్టరీత్య చర్యలు తీసుకొని,తమకు న్యాయం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు తులసీరామ్,వడై అరుణ్ కుమార్,పోశెట్టి,బిక్కు,వెంకటి,రామయ్య,గురువయ్య,రాజుబాబు,గ్రామస్థులు,రైతులు పాల్గొన్నారు.