Saturday, 7 May 2016

అకాల వర్షానికి మామిడి రైతులకు నష్టం

అకాల వర్షానికి మామిడి రైతులకు నష్టం

(రెబ్బెన వుదయం ప్రతినిధి కురిసిన అకాల వర్షాలకు రెబ్బెన మండలంలో మామిడి తోటలకు నష్టం జరిగిందని రైతులు ఆవేదన వేక్తం చేస్తున్నారు,  అకాల వర్షాలకు తోడూ గాలి దుమారం రేగడం తో మామిడి చెట్ల కొమ్మలు విరిగిపోయాయని దీనివలన నష్టాతీవ్రత ఎక్కువ జరిగినదని రైతులు అందొలన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం దిగుడది కూడా అరకొర కాగా ఉన్న పంటకు  ఈ అకాల వర్షాలకు తోడవటం తో రైతులు కోలుకొని నష్టం జరిగింది అని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు,  సంబదిత వ్యవసాయ అధికారులు మరియు రెవిన్యూ అధికారులు పంట నష్టం ని పరిశిలించి  నష్టాపరిహరం చెల్లించాలని రైతులు డిమాండ్ చేసారు. 

నిరుద్యోగ యువతకు జాబ్ మేళా


నిరుద్యోగ యువతకు జాబ్ మేళా

(రెబ్బెన వుదయం ప్రతినిధి సింగరేణి ఆణిముత్యాలు జాబ్ మేళా ప్రొగ్రామ్  లో భాగంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలకు సంబందించిన ట్రెయినింగ్ ఇవ్వటం జరుగుతుందని  డి జి యం పర్సనల్ జె చిత్తరంజన్ కుమార్  ఒక  ప్రకటన లో తెలిపారు  
ట్రైనింగ్ ఇన్ డాటా ఎంట్రి :- కార్వీ హైదరాబాద్ సంస్థ వారిచే 45 రోజుల కమ్యూనికీషణ్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లేష్ మరియు డాటా ఎంట్రి మొదలగు వాటిపై ట్రైనింగ్ ఇస్తారు, ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులు దీనికి అర్హులు, కానుక ఆసక్తి గల నిరుద్యోగ యువత తమ ధరాఖాస్తులను ఈ నెల 9వ తేదిలోపు జి.ఎం. ఆఫీసు లోని పర్సనల్ డిపార్ట్మెంట్ నందు అందజేయలని  కోరారు.    

తనిఖీ లో అక్రమ కలప లభ్యం

తనిఖీ లో అక్రమ కలప లభ్యం   

(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలో అటవీ అధికారులు శనివారం ఉదయం రెబ్బెన మండలంలోని  ఖైరగూడ సమీపంలో  తనిఖీ నిర్వహిస్తుండగా  వారికీ అక్రమాంగ   దాచిన చెట్ల పొదల్లోఎనిమిది టేకు దుంగలు దొరికాయి  ఎఫ్ అర్  వో వినయ్ కుమార్ అందించిన సమాచారముతో డిప్యూటి ఆర్ వో శ్రీనివాస్ టేకు దుంగలను  పట్టు కున్నారు. టేకు దుంగల  విలువ 14,456/- రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు.  ఈ కూంబింగ్ లో  బీట్ అధికారులు ఎం డి అతరోద్దిన్, మహ్మాద్, రవి,  ప్రైవేటు సిబ్బంది ఉన్నారు . 

మైనార్టీల అభివృద్ధి తెరాస తో సాధ్యం

     మైనార్టీల అభివృద్ధి తెరాస తో సాధ్యం 



(రెబ్బెన వుదయం ప్రతినిధి రెబ్బెన  మండలం లో ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.  చంద్ర శేఖర్ రావు తో సాధ్యం అవుతుందని అలాగే మైనార్టీ ల సంక్షేమం కోసం పాటుపడుతుందని మండల కో ఆప్షన్ సభ్యులు యమ్. ఏ జాకీర్ ఉస్మాని అన్నారు.శనివారము విలేకర్లతో మాట్లాడుతూ  ముస్లిం మైనార్టీ కు 12% రిజర్వేషన్ , షాది  ముబారక్ , ఎస్ టి, ఎస్ సి , బి సి లకు కళ్యాణ లక్ష్మి 51,000 రూపాయలు  ఇవ్వడం చాలా సంతోషకరమని స్థానిక  ఎం .ఎల్.ఎ. కోవ లక్ష్మి , ఆదిలాబాద్ ఎమ్. ఎల్. సి. పురాణం సతీష్ కుమార్ రెబ్బెన మైనార్టీ అభివృద్ధి కొరకు ఇప్పటికే 5 లక్షలు మంజూరు చేయడం జరిగిందని త్వరలో షాదిఖాన కొరకు ప్రభుత్వ భూమి ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా ఖబ్రస్తాన్ ప్రహరి గోడ పనులకు  త్వరలోనే  ఎం .ఎల్.ఎ. మరియు ఎమ్. ఎల్. సి లచే శంఖు స్థాపన చేయనున్నట్లు తెలిపారు . ముస్లిం లకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని అందుకే తెరాస పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు .ఈ సమావేశంలో తెరాస యూత్ నాయకులు డి. వెంకటేష్ , అన్సారీ , ఇమ్రోజ్ , జాఫర్ ఆలి , ఆరిఫ్ పాల్గొన్నారు .      

అబివృద్ది కోసంమే తెలంగాణా ప్రభుత్వం

అబివృద్ది కోసంమే తెలంగాణా ప్రభుత్వం

(రెబ్బెన వుదయం ప్రతినిధి) , గ్రామగ్రామాల శ్రేయస్సు, దిన దిన అబివృద్ది కోసం తెలంగాణా ప్రభుత్వం కంకాణం కట్టుకుందని ఆదిలాబాద్ ఎం.ఎల్.సి. పురాణం సతీష్ కుమార్, అసిపాబాద్ ఎం ఎల్ ఎ కోవా లక్ష్మిలు అన్నారు బంగారు తెలంగాణా లో బాగాంగ గ్రామగ్రామ లకు  శ్రేయస్సు కోసం తెలంగాణా ప్రభుత్వం పాటుపడుతుందని ఇంకా మరెన్నో అబివృద్ది కార్యక్రమములు తెలంగాణా ప్రభుత్వం నిరంతరం చేపడుతుందని అయన చెప్పారు శుక్రవారం రెబ్బెన మండలంలో ని తుంగేడ లో మూర్తి కుంట చెరువు ను కోటి అరవై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమములకు భూమి పూజ చేసారు, దీనివలన 450 ఎకరాల భూమి సాగులోని వస్తుంది అని అయన చెప్పారు, మాధవైగుడలో అంగన్ వాడి కేంద్రనికి నూతన భవనానికి 6. 50 లక్షలు భూమి పూజ చేచారు అనంతరం నావేగం లో ని 5 లక్షల ఇంటేక్వాల్ భూమి పుజచేశారు ఈ భావి వాళ్ళ స్తానికి 300 కుటుంబాలకు త్రాగునీటి ఇబ్బందులు తోలుగుతాయని అన్నారు గత ప్రభుత్వల వల్లే నిర్లశం వల్లేనే అబివ్రుది ఆమడ దూరంలో గ్రామలో ఉన్నాయని యం ఎల్ సి అన్నారు ఎల్లు గాడుస్తున్న రెబ్బెన మండ్లమలో ని నావేగం కనీస సౌకర్యాలు లేక అంధకారంలో గ్రామమం మగ్గుతున్నాడని అన్నారు తెలంగాణా రాష్ట్రము సిద్దినిసిన తరువాతే కుగ్రంలా సైతం అబివ్రుది బాగమని వక్యనిచారు, నూతన సి సి రోడ్ లును ప్రారంబించారు, అనతరం ఖైర్గం నుండి నావేగం వరకు అసంపూర్తిగా వున్నా వంతెనను వచ్చే వర్షాకాలం లోపు పూర్తిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమములో జెడ్ పి టి సి అజ్మీర బాబురావు ఎం పి పి సంజీవ్ కుమార్, తూర్పు జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ జేశ్వల్, చెన్న సోమషేకర్, పోటు శ్రీధర్ రెడ్డి, తదితర నాయకులూ పాల్గొన్నారు.

టి అర్ ఎస్ లో కి చేరిన తెలుగు తమ్ముళ్ళు


టి అర్ ఎస్ లో కి చేరిన తెలుగు తమ్ముళ్ళు 

(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలంలోని తెలుగుదేశం పార్టికి చెందినా  నాయకులు ఏకతాటిపైకి వచ్చి  టి అర్ ఎస్ లో చేరారు ఆదిలాబాద్ ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్,  అసిపాబాద్ ఎం ఎల్ ఎ కోవా లక్ష్మి లు తెలుగుతమ్ముళ్ళకు టి అర్ ఎస్ కండువాలు కప్పి ఆహానిచారు. ఈ సందర్భంగా  సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ సాధ్యమని టి అర్ ఎస్ పార్టి  చేపట్టిన అభివృద్ధి పనులు , సంక్షేమ పతకాలకు ఆకర్షితులమై టి ఆర్ ఎస్ పార్టి లో చేరినట్లు తెలిపారు . మండలాన్నిఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ , ఆసిఫాబాద్ ఎం ఎల్ ఎ కోవా లక్ష్మి అండదండలతో  అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే లక్షమని ఆనయ అన్నారు . మోడెమ్ సుదర్శన్ గౌడ్ తో పాటు మండలము లోని తెలుగు దేశం పార్టి కార్య కర్తలు అందరు చేరారు.ఈ కార్యక్రమములో జెడ్ పి టి సి అజ్మీర బాబురావు ఎం పి పి సంజీవ్ కుమార్, తూర్పు జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ జేశ్వల్, చెన్న సోమషేకర్, పోటు శ్రీధర్ రెడ్డి, తదితర నాయకులూ పాల్గొన్నారు.  

Thursday, 5 May 2016

గుడుంబా స్తావరాలపై దాడులు

గుడుంబా స్తావరాలపై దాడులు 
(రెబ్బెన వుదయం ప్రతినిధి) మండల కేంద్రములోని సింగల్ గూడా , గోలేటి గ్రామాలపై ఎక్సైజ్ సిబ్బంది మంగళవారము దాడులు జరిపి గుడుమ్బాను ద్వంసం చేశారు . గోలేటి , సింగల్ గూడలో 300 లీటర్ల బలం పానకం , 30 లీటర్ల నాటు సారా ను ద్వంసము చేశారు . లో   సి ఐ ఫకీర్ మాట్లాడుతూ నాటు సార , గుడుంబా తయారు చేసినట్లయితే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు . గ్రామా లలో ఎవరు గుడుంబా తయారు చేసినట్లు తెలిసిన మా దృష్టికి తేవాలని ఆయన అన్నారు . 

విద్య , వైద్యం , ఉపాధి అవకాశాలు కల్పించదములొ ప్రభుత్వం విఫలం

విద్య , వైద్యం , ఉపాధి అవకాశాలు కల్పించదములొ ప్రభుత్వం విఫలం 
ఎ ఐ వై ఎఫ్ జిల్లా ఉపాధ్యాక్షుడు బోగే 


(రెబ్బెన వుదయం ప్రతినిధి) రాష్ట్రములో అర్హులైన వారందరికీ విద్యా , విద్యా , ఉపాధి అవకాశాలు కల్పించదములొ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అ ఐ వై ఎఫ్ జిల్లా  ఉపాధ్యాక్షుడు బోగే ఉపేందర్ అన్నారు . మంగళ వారము 57 వ ఎ ఐ వై ఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరించారు . యాన మాట్లాడుతూ 1959 సంవత్సరములో మే 3 న దేశ రాజధాని లో చాడ , రాజేశ్వర్ రావు , ఎ బి బర్డెన్ , బలరాజ్ సాహు లు యువతను ఎకతతికి తీసుకు రావడానికి ఎ ఐ వై ఎఫ్ ను స్తాపించారని తెలిపారు . నాటి నుండి నేటి వరకు యువతీ యువకుల కొరకై ఎన్నో పోరాటాలు చేసిందన్నారు . ఖాలిగా ఉన్న 1076 లక్షల ఉద్యోగాలను భారతి చేయాలని , కాంట్రాక్టు కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా పర్మినెంట్ చేయాలని అన్నారు . ,  లంచగొండి తనం , పదవి వ్యామోహాలకు వ్యతిరేకంగా యువత పోరాటం చేయాలని పేర్కొన్నారు . ఈ కార్య క్రమములో నాయకులు తిరుపతి , ఎ రమేష్ , రఆర్ నర్సయ్య , సి ఎహ్ అశోక్ , పుదరి సాయి  సుగుణాకర్ , శంకర్, పోశాన్నా లు ఉన్నారు .

రైతులకు వ్యవసాయ సుబ్సిడి పై అవగాహనా


                     రైతులకు వ్యవసాయ సుబ్సిడి పై అవగాహనా

 (రెబ్బెన వుదయం ప్రతినిధి)   ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ కోరకు సబ్సిడీపై అందించే పనిముట్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయాధికారిణి మంజుల అన్నారు  సోమవారం  రెబ్బెన మండలంలోన గోలేటి  గ్రామాల్లో మన తెలంగాన-మన వ్యవసాయం అవగాహన సదస్సులో మంజుల మాట్లాడుతూ  రైతులు వ్యవసాయ భూసార పరీక్షలు చేయించుకోని పంటలను పండిస్తూ అధిక దిగుబడులను .సాధించాలని పెరుకున్నారు   రైతులు , పాడిపశువుల పెంపకం చేపట్టి ఆర్థికంగా ప్రగతి పథంలోకి సాధించాలని కోరారు. రైతులు సేంద్రియ ఎరువులు వాడడం వల్ల అదిక దిగుబడులు వస్తాయని,  ఆధునిక పద్దతి లో మెలుకువలు పాటించి, సేంద్రియ ఎరువులు వాడడం అదిక దిగుబడి సాదించాలని రసాయన ఎరువులను వాడితే బుసారం దెబ్బతిని దిగుబడులు తక్కువకు కారణం అవుతాయి అని అన్నారు.  ఈ సదస్సులో పశువైద్య అధికారి సాగర్, సర్పంచ్‌ తోట లక్ష్మన్, ఎం పి టి సిలు సురేధర్ మురళి బయీ  తదితరులు పాల్గొన్నారు .

మట్టి రోడ్ పనుల ప్రారంబించిన సర్పంచ్

మట్టి రోడ్ పనుల ప్రారంబించిన సర్పంచ్ 



(రెబ్బెన వుదయం ప్రతినిధి)  జాతీయ ఉపాది హామీ పతకం ద్వారా మట్టి రోడ్ పనులను సోమవారం రోజున  రెబ్బెన: మండలం ఎస్ టి కాలనీ లో స్థానిక సర్పంచు పెసరు వెంకటమ్మపనులను ప్రారంబించారు. సర్పంచు పెసరువెంకటమ్మమాట్లాడుతూ వ్యవసాయ భూములకు వెళ్లేందుకు కాళీ నడక భాట లేక రైతులు ఇబ్బంది పడుతున్నరని వారికి సౌకర్యంగా ఉండే విదంగా ఈ పనులను చేపట్టినట్లు మరియు ఉపాది కూలీలకు 100 రోజుల పనులు కల్పించే విదంగా మట్టి రోడ్ పనులు చేపట్టడం జరిగిందని  అన్నారు. ఈ  సందర్భంగా  నాయకులు మదునయ్య మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం సిద్దించిన తర్వాతే కూ..  గ్రామలకు సైతం రోడ్లను నిర్మించడం జరుగుతుందని  అన్నారు  ఈ కార్యక్రమానికి మండల ఉపసర్పంచు శ్రీధర్ కుమార్,ఫీల్డ్ అసిస్టెంట్ తుకారం, మెట్ తిరుపతి,  నాయకులు, వెంకటేశ్వర్ల గౌడ్ తో పటు పలువురు ఉపాది కూలీలు పాల్గున్నారు

Monday, 2 May 2016

శ్రమ శక్తి అవార్డు అందుకుంటున్నా శ్రీనివాస్


     శ్రమ శక్తి  అవార్డు అందుకుంటున్నా శ్రీనివాస్ 
  • మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్నా దృశ్యం 
(రెబ్బెన వుదయం ప్రతినిధి) హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో మే డే సందర్భంగా శ్రమ శక్తి అవార్డు ను ఆదిలాబాద్ జిల్లా రెబ్బెన మండలములోని గోలేటి  కి చెందినా మల్రాజు శ్రీనివాస్ కు హోం , కార్మిక శాఖ మంత్రి నాయిని నరసింహ రెడ్డి చేతుల మీదుగా తీసుకున్నారు . ప్రస్తుతం శ్రీనివాస్ రావు టి బి జి కే ఎస్ కేంద్ర కార్య దర్శిగా పని చేస్తున్నాడు . గతం లో టి బి జి కె ఎస్ ఏరియ ఉపాధ్యాక్షునిగా పని చేశారు . అవార్డు అందుకునా శ్రీనివాస రావు మాట్లాడుతూ ఈ అవార్డు రావడానికి సహాకరించినటి బి జి కె ఎస్ కార్యకర్తలకు , సింగరేణి కార్మికులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు . అదెవిఅదంగా తూర్పు జిల్లా ఎం ఎల్ ఎ లు , ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు .  







పైపుల కంపెనీ లో మేడే వేడుకలు

   పైపుల కంపెనీ లో మేడే వేడుకలు 
(రెబ్బెన వుదయం ప్రతినిధి)  రెబ్బెన మండలంలో స్తానిక పల్లవి పైపుల కంపెనీ లో సి ఐ టియు  సి అధ్వర్యంలో మేడే 130 వ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండాను ఆవిష్కరించారు కార్మికుల హక్కుల కోసం పోరాడాలి అని కార్మికులు అందరు ఏకముగా వుండాలని అన్నారు ఈ కార్యక్రమంలో   సి ఐ టి యు  సి   జిల్లా ఉప   అధ్యక్షుడు అల్లూరి లోకేష్ ,  గిరిజన సంఘం జిల్లా కమిటి సబ్యులు భీం రావు ,నానాజీ,రమేష్ ,మొండి ,శ్రీనివాస్, మల్లేష్ , తదితరులు పాల్గొన్నారు 

ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు

ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు 

(రెబ్బెన వుదయం ప్రతినిధి) 130వ మేడే దినాన్ని కార్మికులు రెబ్బెనలో ఆదివారం  ఘనముగా జరుపుకున్నారు. గోలేటిలోని   సి పి  ఐ కార్యాలయంలో జెండా ఎగుర వేసి అనంతరం కార్యాలయం  నుంచి  బారి ఎత్తున కార్మికులు,ఉద్యోగులు  బైకుర్యాలి ప్రముఖ వీదుల గుండా   రెబ్బెన  బస్సు స్టాండ్ వరకు  నిర్వహించారు.అనంతరం రెబ్బెన లో సి పి ఐ  జిల్లా కార్యవర్గ సబ్యులు ఎస్ తిరుపతి అధ్వర్యంలో రెబ్బెన బస్టాండ్ ఏరియా లో మండల కార్యదర్శి పొన్న  శంకర్      జెండా ఆవిష్కరించారు.  అనంతరం పలు నాయకులు మాట్లాడుతూ మే 1తేదిన కార్మికులు   కార్మికుల హక్కుల దినోత్సవం కాబట్టి కార్మిక హక్కుల దినం కావడంతో కార్మికుల హక్కులకై పొరాటాలు చేయాలని,1కార్మికులు ఏకం కావాలని ఐక్యముగా వుండాలని  పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోఎ ఐ టి యు సి, ఎ ఐ ఎస్ ఎఫ్, సి పి ఐ నాయకులు బోగే ఉపేందర్,దుర్గం రవీందర్ ,రాయిల్ల నర్సయ్య ,పుదరి సాయి, శంకర్,శ్రీనివాస్ తదితర కార్మికులు  పాల్గొన్నారు.