ఆరోగ్య సేవలందిస్తున్న ఆశాకార్యకర్తల సమస్యలను ప్రభుత్వము సత్వరమే పరిష్కరించాలని మండల కార్యదర్శి అధ్యక్షురాలు అనిత డిమాండు చేశారు.మాట్లాడుతూ తమ హక్కుల సాధన కోసం చేస్తున్న రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రి ముందు నిరవధిక సమ్మె మంగళవారానికి 35 వరోజుకు చేరిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆశావర్కర్లు నిరవదిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీమన్నారు. ఇప్పటికైనా ఆశావర్కర్ల డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలన్నారు ఈ కార్యక్రమంలో సునీత, నిర్మల, చాయ , సుకన్య, సుజాత, భాగ్య, తిరుమల, తదితరులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Wednesday, 7 October 2015
Sunday, 4 October 2015
మహాసభకు తరలిన ఏఐటీయూసీ నాయకులు
మహాసభకు తరలిన ఏఐటీయూసీ నాయకులు
మంచిర్యాలలో నిర్వహిస్తున్న ఏఐటీయూసీ ప్రథమ మహాసభలకు ఏఐటీయూసీ నాయకులు ఆదివారంనాడు గోలేటి నుంచి భారీగా తరలివెళ్లారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ , గోలేటి బ్రాంచ్ కార్యదర్శి మొగలి, సీపీఐ జిల్లా నాయకులు మామిడాల రాజేశం, ఏఐటీయూసీ నేతలు రామారావు, సంపత్‌రావు, శివారావుతో పాటు పెద్దఎత్తున అధికారులు వెళ్లారు
వంట వార్పు చేసి నిరసన తేలిపిన ఆశ కార్యకర్తలు
వంట వార్పు చేసి నిరసన తేలిపిన ఆశ కార్యకర్తలు
ఆశా కార్యకర్తలు ఆదివారం నాడు రెబ్బెనలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కార్యాలయం ముందు సమ్మెలో భాగంగా వంట వార్పు చేసి నిరసన వ్యక్తం చేసారు. సీ,అయ్,టీ,యు మండల అధ్యక్షురాలు ఆశ కార్యకర్త అనిత మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, పదోన్నతులు కల్పించాలని, కనీస వేతనం రూ. అర్హులైన వారిని ఏ,ఎన్,ఎం లుగా గుర్తించాలని, 33వ రోజులా వరకు చేరినా కూడా ప్రభుత్వం తమ కష్టాలు పట్టించుకోకపోవడం దుర దృష్టకరమని అన్నారు . గ్రామీణ స్థాయిలో పనిచేసే వైద్యసిబ్బందితో విధులు నిర్వహిస్తున్నప్పటికి ఉద్యోగ భద్రత కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు రోగులకు వైద్యసేవలు అందించినప్పటికీ కనీస వేతనం తో తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు రమ, ఆ సంఘం కార్యకర్తలు కవిత,స్వప్న, తిరుమల, ఛాయ ,రాజేశ్వరి, నిర్మల, రమాదేవి, లక్ష్మీ,సుజాత, సునీత, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Saturday, 3 October 2015
గుడుంబా స్థావరాలపై దాడి మరియు అవగాహన ర్యాలీ
గుడుంబా స్థావరాలపై దాడి మరియు అవగాహన ర్యాలీ
రెబ్బెన మండలలో శనివారం నాడు సింగల్గుడా తండాలోని గుడుంబా తయారీ స్థావరాలపై ఎక్షైజ్ అధికారులు దాడి చేసి 30 లీటర్ల గుడుంబా మరియు 300 లీటర్ల బెల్లం పానకం ద్వంసం చేసారు, గుడుంబా నిషేదానికి ప్రతివొక్కరు సహకరించాలని ఎక్షైజ్ సి.ఐ. ఫకీర్ అన్నారు. గుడుంబా నిషేధం పై ర్యాలి చేపట్టి ప్రజల్లో అవగాహన సదస్సు ను ఎక్షైజ్ అధికారులు మరియు రెబ్బెన ఎస్.ఐ. హనుక్ నిర్వహించారు . ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, విద్యార్థులు,నాయకులు పెద్ద సంఖ్యలోపాల్గొని గుడుంబా వల్ల కుటుంబాలు చిన్న బిన్నం అవుతున్న తీరును వివరించారు.గుడుంబా తయారీ నిషేధం పై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సై హనుక్ మరియు అబ్కారి ఎస్సై సుందరసింగ్ తో పటు వారి సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గున్నారు
ఆశలు మోకాళ్ళపై వినూత్న నిరసన
ఆశలు మోకాళ్ళపై వినూత్న నిరసన
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మెకు దిగిన ఆశావర్కర్లు శనివారం కూడా సమ్మెను కొనసాగించారు రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రి ముందు సమ్మెలో మోకాళ్ళ మీదా నిలపడి వారి నిరసనను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆశావర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు అనిత, కార్యదర్శులు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని 32 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం తమకు తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది అని వారు వాపోయారు. తాముకూడ ప్రజల కొరకు పని చేస్తున్నామని మార్కెట్ లో నిత్యావసరాల సరుకుల ధరలు ఆకాశానంటు తున్నందున, ప్రభుత్యం ఇస్తున్న వేతనం మాకు ఏమలనకు కూడా సరిపోవడం లేదు కావున కనీస వేతనం పెంచాలని వారు డిమాండ్ చేశారు, తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి పరిష్కరమయ్యేలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఆశావర్కర్లు, సునీత, సుకన్య, సుజాత, భాగ్య, తిరుమల, నిర్మల, చాయ తదితరులు పాల్గొన్నారు.
దొంగతనాలు తో వాహన యజమానుల ఆందోళన
దొంగతనాలు తో వాహన యజమానుల ఆందోళన
రెబ్బెన మండల కేంద్రం లో వివిధ అటో ట్రాలీలకు చెందినా టైరులు, బ్యాటరి మరియు పనిముట్ల కిట్టు దొంగతనం జరిగింది, వాహన యజమానుల కథనం ప్రకారం శుక్రవారం రాత్రి వారు పని ముగించుకొని వారి ఇంటిముందు పార్కు చేసిన ఆటోలో ని సామగ్రిని దొంగిలించారు అని వారు తెలిపారు రెబ్బెన కు చెందిన పందిర్ల శ్రావణ్ కుమార్ కు చెందిన అప్పి ట్రాలీ అటో కు చెందినా బ్యాటరిని, కనకయ్య కు చెందినా ఆటో ట్రాలీ నుండి టైర్లు మరియు నందేవ్ ఆటో ట్రాలీ నుండి పనిముట్ల సామాగ్రి ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు, ఇలాంటి సంఘటననే ఇంతకు ముందు కూడా అదే స్థలంలో లారీలనుండి టైర్లు మరియు డిజిల్ దొంగతనం జరిగింది అని, అప్పుడు తగు చర్యలు తీసుకోనివుంటే మల్లి ఇలాంటి సంఘటన జరిగేది కాదని వారు తెలిపారు.
Friday, 2 October 2015
పెండింగ్‌లో ఉన్న ఉపకారవేతనాలు విడుదల చేయాలి
గత రెండు సంవత్సరాలుగా విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇవ్వకపోవడంతో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతుందని తెలంగాణ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో రెబ్బెన బస్టాండ్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ విద్యార్థి వేదిక జిల్లా అధ్యక్షులు సాయి మాట్లాడుతూ దాదాపుగా 17వందలకోట్ల బకాయిలతో ఉపకారవేతనాలున్నాయని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్నా విద్యార్థుల సమస్యలు పరష్కరించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపకారవేతనాలను పెంచి ఎన్నికల్లో ఇచ్చిన హామి ఉచిత విద్యను అమలు చేయాలని, కార్పోరేట్ విద్యను రద్దు చేసి మెస్‌చార్జీలు పెంచాలని, సన్నబియ్యంపై విచారణ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు వినోద్, ప్రణయ్, తదితరులు పాల్గొన్నారు.
వయోజన విద్య 100% అక్షరాశ్యత సాధించాలి -ఎంపీపీ
వయోజన విద్య 100% అక్షరాశ్యత సాధించాలి -ఎంపీపీ
గాంధీజీ 146 జయంతి వేడుకలను శుక్రవారం రెబ్బెనలోని జడ్పిఎస్ఎస్ పాటశాలలో ఘనగా పురష్కరించుకొని అనంతరం ఎంపీపీ సంజీవ్ అమ్మ నాన్నకు చదువు కార్యాక్రమం గురించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఈ రోజు నుంచి 8, 9, 10వ తరగతి చదివే విద్యార్థులు వారి తల్లిదండ్రులకు చదవడం, రాయడం వచ్చే విధంగా చదువు నేర్పించాలని, ఎన్,ఆర్,ఈ,జీ,ఎస్ వారి గ్రూపులో ఉన్న నిరక్షరాసులకు 90 రోజుల్లో చదువు నేర్పించాలని తెలంగాణా రాష్ట్రంలో అదిలాబాద్ జిల్లలో గ్రామ జ్యోతి వయోజన విద్య 100% అక్షరాశ్యత సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో జడ్పిటిసి బాబురావు, ఎంపీడీవో ఎంఎ హలీం, ఎపీఎమ్ రెబ్బెన క్లస్టర్ రాజ్ కుమార్, ఎంఈఓ వెంకటేశ్వర స్వామీ, ఎచ్ఎం. స్వర్ణలత, సర్పంచ్ పెసరు వెంకటమ్మ, సాక్షర భారత్ కోఆర్దినెటార్ సాయిబాబా, పాటశాల సిబ్బంది, విద్యార్థులు తదీతరులు పాల్గొన్నారు.
గాంధీ చిత్రపటానికి ఆశాలు వినతిపత్రం
తమ న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని గాంధి జయంతిని ఘనంగా నిర్వహించి అనంతరం గాంధీ చిత్రపటానికి శుక్రవారం ఆశావర్కర్లు వినూత్నగా వినతిపత్రం ఇచ్చి తమ సమస్యను పరిష్కారమయ్యేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ నేటి సమాజంలో పెరుగుతున్న కూరగాయల ధరలు, నిత్యావసర వస్తువులకు అనుగుణంగా ప్రభుత్వం తమ వేతనాలను పెంచాలని, లేదంటే తమ పరిస్థితి అగమ్య గోచరంగా తయారై వీధుల పాలవుతాయని, అర్హులైన వారిని ఏ,ఎన్,ఎం లుగా గుర్తించాలని, రెబ్బెన ప్రాథమిక చికిత్స కేంద్రం ముందు ఆశ కార్యాకర్తల సమ్మె నేటికి 31 రోజులు అవుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాకపోవడం విడ్దూరంగా ఉందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, తెదేపా మండల అధ్యక్షుడు మోడెం సుదర్శన్ గౌడ్, శంకర్, ఆశావర్కర్ల సంఘం అధ్యక్షురాలు అనిత, ఉపాధ్యక్షురాలు రమ, భాగ్య, సునీత, సుజాత, తిరుమల, నీర్మల, రాజేశ్వరి, రాధ, లక్ష్మీ, ఛాయా, తదితరులు పాల్గొన్నారు.
సాయి విద్యాలయంలో 146వ గాంధీ జయంతి
సాయి విద్యాలయంలో 146వ గాంధీ జయంతి
ఘనంగా 146 గాంధీ జయంతి సంబరాలు
జాతిపిత మహాత్మగాంధీజీ ఆశయాలను నెరవేరుద్దామని తహసీల్దార్ రమష్ గౌడ్ అన్నారు రెబ్బెన మండల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం గాంధీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి అధికారులు పూలమాలలు వేసి 146వ గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ ధర్మం, అహింస మార్గాలను ఆచరించాలని స్వచ్చ తెలంగాణాలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని, మహాత్మడి కలలను సహకారం చేసుకొనేందుకు చేయి చేయి కలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంజీవ్, జడ్పిటిసి బాబురావు, ఎంపీడీవో ఎంఎ హలీం, ఎపీఎమ్ రెబ్బెనక్లస్టర్
రాజ్ కుమార్, ఉపతహసీల్దార్ రామ్మోహన్, ఎంఈఓ వెంకటేశ్వరస్వామీ, సర్పంచ్ పెసరు వెంకటమ్మ, సాక్షర భారత్ కోఆర్దినెటార్ సాయిబాబా, కార్యాలయ సిబ్బంది, తదీతరులు పాల్గొన్నారు.
మహాసభలకు తరిలి వేలిన నాయకులు
30రోజుకు చరిన ఆశావర్కర్లు సమ్మె
గత 30రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో శుక్రవారం రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రి ముందు సమ్మెలో మూతికి వస్త్రం కటుకుని నిరసన తెలేపారు.ఈ సందర్భంగా ఆశావర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు అనిత, కార్యదర్శులు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని 30 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. తమకు కనీస వేతనం 15వేలు ఇవ్వాలని, అలాగే ఆశావర్కర్లకు 2వ ఎఎన్‌ఎంలుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి పరిష్కరమయ్యేలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఆశావర్కర్లు, మండల ఉపాధ్యక్షులు రమ, ఆసంఘం కార్యకర్తలు కవిత, చాయ, నిర్మల, స్వప్న, తిరుమల, రమాదేవి, రాజేశ్వరి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)