రెబ్బెన : వట్టివాగు ప్రాజెక్టు కింద చివరి ఆయకట్టు కింద సాగు చేసుకుంటున్న రైతులకు సాగునీరు అందేలా చూడాలని మండల టీడీపీ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ వట్టివాగు ప్రాజెక్టు కింద 2300ల ఎకరాలు సాగుభూమి ఉందని, చివరి ఆయకట్టు వరకు నీరు అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నీరందకపోవడంతో వేసిన వరినాట్లు ఎండిపోయాయని దీంతో రైతులు బాదపడుతున్నారని పేర్కొన్నారు. వట్టివాగు కింద కాలువకు పైభాగంలో ఉన్న రైతులు నీటిని విచ్చల విడుగా విడుదల చేయడంతో చివరి ఆయకట్టు వరకు నీరుసరిగా అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు పర్యవేక్షించి వెంటనే నీరందేలా చూడాలని అన్నారు. ఈకార్యక్రమంలో రైతులు పాపయ్య, నారయణ, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Tuesday, 4 August 2015
మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించిన ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి
రెబ్బెన : మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్ సోమవారం పరిశీలించారు. పిల్లలకు మెను ప్రకారం మధ్యాహ్నం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. భోజన నాణ్యతను పరిశీలించి విద్యార్థులతో కలిసి బోజనం చేశారు. విద్యార్థులకు అందించే ఆహరంలో నాణ్యత ప్రయాణాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్బు, ముజ్జా, సాయివికాస్, వినయ్, సంజీవ్, హమీద్, రమేశ్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
Monday, 3 August 2015
మరో దృశ్యకావ్యం [ సినిమా]
తాను ఏ తరహా కథాంశాన్ని ఎంచుకున్నా దానిని వైవిధ్యభరితంగా తెరకెక్కించగల దర్శకుడిగా గౌతమ్ వాసుదేవమీనన్‌కు పేరుంది. కెరీర్ తొలిదశలో నాగచైతన్య, సమంతలకు 'ఏ మాయె చేశావె' వంటి హిట్ చిత్రాన్ని అందించి పరిశ్రమలో వారి ఎదుగుదలకు ఎంతగానో దోహదం చేశారు. 'ఏ మాయె చేశావె' తర్వాత నాగచైతన్య పలు చిత్రాలు చేసి హీరోగా స్థిరపడ్డారు. మళ్లీ ఇంతకాలం తర్వాత నాగచైతన్య, గౌతమ్‌మీనన్‌ల కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. మరో సుందర దృశ్యకావ్యంగా ప్రచారం జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల చెన్నైలో ప్రారంభమైన నేపథ్యంలో నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా నాగచైతన్యపై భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ని గౌతమ్‌మీనన్ చిత్రీకరించారు. రెండురోజుల గ్యాప్ అనంతరం సోమవారం నుంచి నాగచైతన్య తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
తొలి షెడ్యూల్లో 50 శాతం చిత్రీకరణను పూర్తిగావించాలని యూనిట్ నిర్ణయించుకుందట. ఇక తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో నాగచైతన్య సరసన మలయాళీ భామ మంజిమ మోహన్ నాయికగా నటిస్తోంది. తెలుగులో దీనిని కోన వెంకట్ నిర్మిస్తుండగా, ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు.
ఇదే చిత్రం తమిళ వెర్షన్‌లో శింబు హీరోగా నటిస్తుండగా, ఆ చిత్రానికి 'అచ్చం ఎన్బదు మదమైయద' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
తొలి షెడ్యూల్లో 50 శాతం చిత్రీకరణను పూర్తిగావించాలని యూనిట్ నిర్ణయించుకుందట. ఇక తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో నాగచైతన్య సరసన మలయాళీ భామ మంజిమ మోహన్ నాయికగా నటిస్తోంది. తెలుగులో దీనిని కోన వెంకట్ నిర్మిస్తుండగా, ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు.
ఇదే చిత్రం తమిళ వెర్షన్‌లో శింబు హీరోగా నటిస్తుండగా, ఆ చిత్రానికి 'అచ్చం ఎన్బదు మదమైయద' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇద్దరు బైండోవర్
రెబ్బెన : రెబ్బెన మండలంకు చెందిన వంకులం గ్రామానికి చెందిన వెంకటేష్, తిరుపతిలను సోమవారం బైండోవర్ చేసినట్లు రెబ్బెన ఎస్సై హనుక్ తెలిపారు. వీరిద్దరు తరుచుగా గొడవపడుతూ ప్రజానికానికి ఇబ్బందిపెట్టారని దీంతో రాత్రి పెట్రోలింగ్ గొడవపడుతూ దొరికారని, ఇద్దరిని బైండోవర్ చేసి తహసిల్దార్ రమేశ్ గౌడ్ ఎదుట హాజరు పర్చినట్లు ఆయన తెలిపారు. అనంతరం సొంతపూచికత్తుపై విడుదల చేశారని తెలిపారు.
తల్లి పాల వారోత్సవాల అవగాహన సదస్సు
పంచాయతీ కార్మికుల 34వ రోజు నిరసన
రెబ్బెన మండలలోని గ్రామపంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మె సోమవారనికి నాటికి 34వ రోజు కావడం వలనఅందుకు నిరసనగా కల్లకి గంతలు కంటుకుని నిరసన తెలిపారు.మండల ప్రచార కార్యదర్శి రత్నంవిఠల్ మాట్లాడుతూ ప్రభుత్వం అంగీకరించాలని తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు చేపట్టిన నిరవదిక సమ్మెలో ఉద్యోగభద్రత కల్పిస్తూ పదవ పిఆర్‌సి ప్రకారం వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ నిరసనలో , జిల్లా ఉపాధ్యాక్షుడు బాబాజీ, ప్రకాష్, తిరుపతి, లక్ష్మి, రాజమ్మ, కార్మిక సిబ్బంది పాల్గొన్నారు.
Saturday, 1 August 2015
ప్రధానోపాధ్యాయునికి వీడ్కోలు
రెబ్బెన : ఇం ద్రనగర్‌లోని ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన డి. శ్రీనివాసుల సేవలు మరవలేవని రెబ్బెన తహసీల్దార్ రమేష్‌గౌడ్, ఎంఈవో మహేశ్వరెడ్డిలు అన్నారు. శనివారం బదిలీపై వెళుతున్న శ్రీనివాసులకి ఘనంగా సాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో మహేశ్వరెడ్డి మాట్లాడుతూ పాఠశాలను జిల్లాలోనే ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్ధిన ఘనత శ్రీనివాసికే దక్కిందని అన్నారు. పీఆర్‌టీయూ ప్రె సిడెంట్ ఖాదర్, హెచ్‌ఎం రవికుమార్, నాయకులు, విద్యాకమిటీ చైర్మన్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
సిం గరేణి కాలనీలో సంక్షేమ పథకాలు
రెబ్బెన : బెల్లంపల్లి ఏరియాలో సింగరేణి కాలనీలో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు బీపీఏ జీఎం కె. రవిశంకర్ అన్నారు. శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాగునీటి పైప్‌లైన్ , కాలనీలో కొత్త రోడ్లు, గోనేటిలో డ్రైనేజ్, బెల్లంపల్లిలో సులభ్ కాంప్లెక్స్‌లను నిర్మిస్తున్నట్లు మిగిలిన పనులకు టెండర్లు పంపిన్నట్లు తెలిపారు.
బెల్లంపల్లి ఏరియా బొగ్గు ఉత్పిత్తి 113శాతం
రెబ్బెన : బెల్లంపల్లి ఏరియా గనుల జులై నెల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం నాలుగు లక్షల ఆరవై ఒక్క టంన్నులు బొగ్గు ఉత్పత్తికిగాను, 519037 టంన్నుల బొగ్గు ఉత్పత్తితో 113శాతం నిలిచిందని బెల్లంపల్లి ఏరియా జీఎం కె. రవిశంకర్ తెలిపారు. అలాగే డోర్లీ టు ఓసీలో బొగ్గు ఉత్పత్తి 2126600 బొగ్గు ఉత్పత్తికి గాను 2056244 టంన్నుల బొగ్గు ఉత్పత్తితో 97శాతం వచ్చిందని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ నిధుల దుర్వినియోగం
రెబ్బెన : కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్దికై ప్రవేశపెట్టిన పథకాలలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయని వాటిపై సీబీసీఐడీ విచారణ చేపట్టాలని ఎమ్‌ఆర్‌పీఎస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ కేశవరావు మాదిగ అన్నారు. రెబ్బెనలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అన్నారు. అమాయక ఎస్సీ ఎస్టీ ప్రజలను దలారులు మండలనాయకులు మోసం చేసి లక్షలాది రూపాయలు కార్పోరేషన్ ద్వారా లబ్ది పొందుతున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీల పేర్లతో ఆటోలు లారీలు వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేస్తూ పొట్టకొడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లింగంపల్లి ప్రభాకర్, ఇప్ప నాగరాజు, మండల అధ్యక్షులు నర్సింగరావు, మండల ప్రధాన కార్యదర్శి సిరివల్ల నర్సింహులు పాల్గొన్నారు
తల్లి పాలే బిడ్డలకు శ్రేయస్కరం
రెబ్బన : కన్న తల్లి పాలే బిడ్డలకు శ్రేష్టమని తల్లి పాలు బలం ఇవ్వడమే కాక వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయని ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు భాగ్యలక్ష్మి, లక్ష్మి అన్నారు. రెబ్బెన లో తల్లిపాల వారోత్సవాల సందర్బంగా అంగన్ వాడీ కార్యక ర్తలు వీధుల గుండా శనివారం ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లి పాల వారోత్సవాలు ఈనెల 1 నుండి 7 వరకు జరుగుతాయని ప్రతి అంగన్ వాడీ కార్యకర్త తల్లి పాల ప్రాముఖ్యత వివరించాలన్నారు. ఈ ర్యాలీలో సర్పంచ్ వెంకటమ్మ బాలమ్మ, చంద్రకళ , సంధ్యారాణి పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల అక్రమ నిర్మాణాలపై విచారణ
రెబ్బెన : రెబ్బెన మండలంలోని కిష్టాపూర్, గద్వాపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల అక్రమనిర్మాణాలనై సీఐడీ డీఎస్పీ రవికుమార్‌విచారణ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ కిష్టాపూర్ గ్రామ పంచాయితీలో 7 ఇల్లు, బాబాపూర్‌లో 19, ఇంద్రవెల్లి మండలంలోని గిన్నెరలో 3, ఖానాపూర్ లో 47, మొత్తం 76 ఇల్లు నిర్మించకుండానే పాత ఇల్ల పేరుమీదగా స్వాహా చేశారని ఈ నివేదికలను త్వరలో ప్రభుత్వానికి అందచేయనున్నట్లు తెలిపారు. ఈ విచారణలో ఎస్‌ఐ శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుల్ శంశాద్ ఖాన్ డీఈ రాము పాల్గొన్నారు.
జీపీ కార్మికుల 32 నిరసన
రెబ్బెన : మండలలోని గ్రామపంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మె శనివారం నాటికి 32వ రోజు కావడం వలన అందుకు నిరసనగా ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు.వారి డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు చేపట్టిన నిరవదిక సమ్మెలో మాట్లాడుతూ ఉద్యోగభద్రత కల్పిస్తూ పదవ పిఆర్‌సి ప్రకారం వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ నిరసనలో మండల ప్రచార కార్యదర్శి రత్నం విఠల్, జిల్లా ఉపాధ్యాక్షుడు బాబాజీ, ప్రకాష్, తిరుపతి, లక్ష్మి, రాధమ్మ, కార్మిక సిబ్బంది పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)