రెబ్బెన : రెబ్బెన మండలంలోని వంకులం గ్రామ పంచాయతీలో కుళాయిలు పనిచేయక ప్రజలు చేతిపంపు మీద ఆధారపడి ఉండగా చేతి పంపు వద్ద వాడిన నీరు ఎటూ వెళ్లే మార్గం లేక అక్కడే నిలిచిపోవడంతో తుంగ గడ్డిపెరిగి చెత్తాచెదారంతో దుర్గంధం వస్తుందని, అక్కడి నిలిచిన నీరు తిరిగి బోరులోకి ఇంకిపోవడంతో నీరు కలుషితం అవుతుంది. గతంలో కూడా అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Thursday, 4 June 2015
మురికి నీటి మధ్య చేతిపంపు
రెబ్బెన : రెబ్బెన మండలంలోని వంకులం గ్రామ పంచాయతీలో కుళాయిలు పనిచేయక ప్రజలు చేతిపంపు మీద ఆధారపడి ఉండగా చేతి పంపు వద్ద వాడిన నీరు ఎటూ వెళ్లే మార్గం లేక అక్కడే నిలిచిపోవడంతో తుంగ గడ్డిపెరిగి చెత్తాచెదారంతో దుర్గంధం వస్తుందని, అక్కడి నిలిచిన నీరు తిరిగి బోరులోకి ఇంకిపోవడంతో నీరు కలుషితం అవుతుంది. గతంలో కూడా అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
Wednesday, 3 June 2015
ఎల్లమ్మ చెరువు పనులను పరిశీలించిన తహసీల్థార్
రెబ్బెన : మిషన్ కాకతీయలో భాగంగా మండల కేంద్రంలో గల ఎల్లమ్మ చెరువులో కొనసాగుతున్న చెరువు పూడిక పనులను బుధవారం తహసీల్థార్ రమేష్‌గౌడ్ పరిశీలించారు. తూము పనుల్లో నాణ్యత లోపం కన్పించడంతో పనుల్లో నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. పనులను త్వరిత గతిని పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్థార్ రామోహన్‌రావు ఉన్నారు.
నిరంతరం వెలుగుతున్న వీధి దీపాలు
రెబ్బెన : రె బ్బెన మండలంలోని వంకులం గ్రామంలో వీధి దీపాలు రాత్రంబవళ్లు వెలుగుతూనే ఉన్నాయి. వాటిని ఆర్పివేయడానికి బటన్స్ ఏమీ లేకపోవడంతో అవి పూర్తిగా పాడైపోయే వరకు అలాగే వెలుగతుంటాయని గ్రామస్తులు పేర్కొన్నారు. అవి పాడైపోయిన తరువాత సుమారు 6 నెలల వరకు తిరిగి విద్యుత్ దీపాలు అమర్చడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
తహశీల్ కార్యాలయంలో తెలంగాణ సంబరాలు
రెబ్బన: తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సం దర్భంగా తహశీల్దార్ రమేష్‌గౌడ్ జాతీయ, తెలంగాణ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. జై తెలంగాణ జైజై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటమ్మ, ఎంపీడీఓ అలీమ్, జడ్పీటీసీ బాబూరావు, ఎంపీపీ సంజీవ్‌కుమార్, ఏపీఎం రాజకుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.
పోలీస్ స్టేషన్‌లో జాతీయ జెండావీష్కరణ
రెబ్బెన : తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవాలలో భాగ ంగా మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ సీహెచ్ హానోక్ ఆద్వర్యంఓ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, అమర వీరులకు నివాళ్ళర్పించారు. అనంతరం ఒకరికోకరు స్వీట్లు పంచిపెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ మీరాజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
బెల్లంపల్లి ఏరియా గోలేటిలో ఉత్పత్తులు
రెబ్బన : మండలంలోని బెల్లంపల్లి ఏరియా గోలేటిలో 104 శాతం బొగ్గు ఉత్పత్తి ఉందని డీఎం. రవి శంకర్ విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. కైర్‌గూడా ఓసీలో 3 లక్షల 22 వేల టన్నులు లక్ష్యంగా ఉండగా 3 లక్షల 7 వేల 96 టన్నులు దిగుమతి రాగా దోర్లి ఓసీలో 1 లక్ష 139 వేల టన్నులు లక్ష్యం కాగా 1లక్ష 68 వేల 749 టన్నులు దిగుమతి రాగా 129 శాతం నిలిచింది. దోర్లి ఓసీ 2లో 82 వేల టన్నులు లక్ష్యం కాగా 82 వేలు దిగుబడి వచ్చింది. ఇది 100 శాతంగా నిలిచింది.ఈ కార్యక్రమంలో డీజీ పర్సనల్ చిత్తరంజన్, కొండయ్య, యూకాన్, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అమరవీరులకు ఘన నివాళులు
రెబ్బన: మండలంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హోస్ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు విడిచిన అమర వీరులకు మండల అధికారులు, నాయకులు ఘన నివాళులు అర్పించి 2 నిమిషాల పాటు మౌనాన్ని పాటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంజీవ్‌కుమార్, జడ్పీటీసీ బాబురావు, ఎంపీడీఓ అలీమ్, మండల తహసీల్దార్ రమేష్‌గౌడ్, డిప్యూటి తహసీల్దార్ రాంమోహన్, మండల సర్పంచ్ వెంకటమ్మ, వైస్ ఎంపీపీ రేణుక, మండలంలోని ఎంపీటీసీలు తదితర నాయకులు పాల్గొన్నారు.
నిరూపయోగంగా అంగన్‌వాడీ భవనం
రెబ్బెన : మండలంలోని వంకులం గ్రామంలోని అంగన్‌వాడీ - 1 కేంద్రానికి సంబంధించిన అంగన్‌వాడీ టీచర్ విధులకు చాలా రోజులు హాజరు కావడంలేదని, దీనితో కేంద్రం ఆవరణలో చెత్తా, చెదారం, ముళ్లపొదలతో శిథిలావస్థకు చేరుకుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేంద్రంలో 40 మంది వరకు చిన్నారులు ఉన్నారు. బాలింతలకు, గర్భిణీలకు, చిన్నారులకు పంపిణీ చేయాల్సిన సరుకులను ఆమె దుకాణాలకు అమ్ముకుంటున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీంతో గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం ఉన్నా తమ పిల్లలు ఇంటికే పరిమితం అవుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు
ర్యాలీ నిర్వహించిన అధికారులు, మహిళలు
ర్యాలీ నిర్వహించిన అధికారులు, మహిళలు
రెబ్బన: తెలంగాణ రాష్ట్ర తొలి అవతరణ వేడుకలలో ఎంపీడీఓ కార్యాలయం నుంచి ప్రధాన రహదారి మీద భారీ ర్యాలీగా తరలివచ్చి బోనాల కుండలతో మహిళా ఎంపీటీసీలు, ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌వరకు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రేణుక, మండల సర్పంచ్ వెంకటమ్మ, కొందార పు శంకరమ్మ, మండల ఎంపీటీసీలు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ తెలంగాణ ఆవిర్భావ వేడుక
రెబ్బన: తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి పట్టణంలో ఉన్న బస్టాండ్ వద్ద పార్టీ జెండాను ఎగురవేశారు. ఆయనతో పాటు సర్పంచ్ వెంకటన్న, వైస్ ఎంపీపీ రేణుక, ఎంపీపీ సంజీవ్‌కుమార్, సింగిల్ విండో చైర్మన్ మదనయ్య, నాయకులు వెంకన్న, నవీన్‌కుమార్ జైస్వల్ తదితర నాయకులు పాల్గొన్నారు.
ఎంపీడీవో కార్యాలయంలో తెలంగాణ సంబరాలు
రెబ్బన: తెలంగాణ రాష్ట్ర అవతర దినోత్సవాన్ని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ సంజీవకుమార్ జాతీయ పతాక ఆవిష్కరణ చేసీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సేవలను మరువలేమని ఆయన ప్రజల కోసం ఎన్నో పధకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటమ్మ, ఎంపీడీఓ అలీమ్, జడ్పీటీసీ బాబూరావు, ఎంపీపీ సంజీవ్‌కుమార్, ఏపీఎం రాజకుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)