Monday, 18 May 2015

రోడ్డు ప్రమాదంలో ఒక్కరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒక్కరు మృతి

(రెబ్బెన వుదయం  ప్రతినిధి, మే 18) రెబ్బెన మండల కేంద్రంలోని అంతరాష్ట్ర రహదారి పై ఆదివారం అర్ధరాత్రి సుమారు 12గం. టాటా ఇండికా మరియు ఇన్నోవా వాహనములు ఎదురేదురగా వచ్చి డీకోన్నాయి. బెల్లంపల్లి నుండి ఆసిఫాబాద్ వెళ్తున్న ఎ.పి.29 బీ.ఎస్. 2898 నం. గల టాటా ఇండికా కారు ఎదురగా కాగజ్ నగర్ నుండి మంచిర్యాల వెళ్తున్న ఇన్నోవా క్రొత్త వాహనం ను డీకోట్టింది, ఇన్నోవా వాహనం లో ప్రయాణిస్తున్న మంచిర్యాల వాసి చెట్ల సతీష్ (36)  అక్కడిక్కడే మృతిచెందాడు, ఇతడు కాగజ్ నగర్ లోని ఒక  పెండ్లి రేసిప్సన్ కు వెళ్లి వస్తూ మృత్యు వాత పడ్డాడాని,  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు  రెబ్బెన ఎస్.ఐ. హనుక్ తేలిపారు

ఎప్పుడూ పెట్రోల్‌ నిల్‌


రెబ్బెన : మండలంలోని ఇండియన్‌ పెట్రోల్‌ బంక్‌లో ఎప్పుడు వెళ్లిన నోస్టాక్‌ బోర్డు దర్శనమివ్వడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంక్‌కు వచ్చిన పెట్రోల్‌ను బ్లాక్‌లో ప్రైవేటు వ్యక్తులకు క్యాన్‌లలో పోస్టూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో ద్విచక్ర వాహనాదారులు వేరే గత్యంతరం లేక అధిక ధర చెల్లించిన పెట్రోల్‌ను కొనుగోలు చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

Saturday, 16 May 2015

మినీ మహానాడును విజయవంతం చేయాలి


రెబ్బెన : మండలం నుండి తెదేప కార్యకర్తలు ఈ నెల 17 ఆదివారము నాడు మంచిరియాల లోని యం ఎన్ అర్      ( గద్దరేగాడి)  గార్డెన్ లో  జరుగు ఆదిలాబాద్ తూర్పు జిల్లా స్తాయి  మినీ మహానాడు కు భారి సంఖ్య  లో హాజరై విజయవంతం చేయాలని  రెబ్బెన మండల  తెదేప అధ్యక్షుడు మోడేం సుదర్శన్ గౌడ్  విలేకరుల సమావేశం లో పిలుపునిచ్చాడు ఈ సమావేశం లో  బొంగు నర్సింగరావు , పొగాకు నవీన్ , గొడిశెల భార్గవ్ గౌడ్ , రాజాగౌడ్ ,  కస్తూరి మహేష్ , నాగరాజు మరియు తదితరా కార్యకర్తలు పాల్గొన్నారు.     

Wednesday, 13 May 2015

లక్ష్మిపూరం సమ్మక్క-సారక్క దేవస్థానం 2వ వార్శికోత్సవం



(రెబ్బెన వుదయం  ప్రతినిధి, మే 13):  రెబ్బెన మండలం లోని లక్ష్మిపూరం గ్రామ మునందు గల సమ్మక్క సారక్క దేవస్తానం నిర్మించి 2 సంవత్సరముల పూర్తి చేసుకొన్న సందర్భంగా ఆలయ పూజారి పిప్పిరి తుకారం ను ఆలయ కమిటి అధ్యక్షులు శ్రీనివాస్, గంగాపూర్  గ్రామా సర్పంచ్ రవీందర్ మరియు నాగయ్య లు ఘనంగా సన్మానిచారు, అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్ధ ప్రసదలతో పటు అన్నదానం ఏర్పాటు చేసారు, ఈ కార్యక్రమం లో ఆలయ కమిటి మెంబర్స్ మరియు  భరీగా  భక్తులు  పాలుగోన్నారు సమ్మక్క సారక్క దేవతల ఆస్సీసులు పొందారు. 

రెబ్బెన లో ఎన్.టి.అర్. విగ్రహాన్ని పగలగొట్టిన గుర్తుతెలియని వ్యక్తులు






రెబ్బెన, మే12(వుదయం ప్రతినిధి): రెబ్బెన మండల కేంద్రంలోని బస్సు స్టాండ్ వద్ద గల ఎన్.టి.అర్. విగ్రహాన్ని సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి విగ్రహం ముక్కు మరియు చేయి ని విరోగ్గోట్టారు, దీంతో మండలంలోని తెదపా నాయకులూ రాష్ట్ర రహాదరి మీద రాస్తా రోకో చేసి ఈ ఘటన కు కారకులైన వ్యక్తులను పట్టుకొని కటినంగా శిక్షించాలని సిర్పూర్ నియోజికవర్గం ఇంచార్జ్ రావి శ్రీనివాస్ ఎస్.ఐ. హనుక్ ను కోరారు, ఈ కార్యక్రమం లో మండల తెదపా అధ్యక్షుడు మోడెం సుదర్శన్ గౌడ్, తెదపా జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి, రెబ్బెన గ్రామా ఉప సర్పంచ్  శ్రీదర్ బొమ్మినేని, అజయ్ జేస్వాల్, సురేష్ జైస్వాల్, బొంగు నరసింగరావు, మద్ది శ్రీనివాస్, బార్గవ్ గౌడ్, జాకీర్, నవీన్ తదితరులు పాలుగోన్నారు . 




  

మిషన్ కాకతీయ పనులను పరివేక్షించిన ఎమ్.పి.డి.ఓ.



రెబ్బెన, మే12(వుదయం ప్రతినిధి): రెబ్బెన మండల కేంద్రంలోని ఎల్లమ్మ చెరువు ను మిషన్ కాకతీయ లో బాగంగా పునురుద్దరించు కార్యక్రమంలో సోమవారం రోజున పనుల పరివేక్షించి చెరువు కట్ట పనుల నాణ్యత ను పరిశీలించిన రెబ్బెన మండల ఎమ్.పి.డి.ఓ. ఆలిం, ఈ కార్యక్రమం లో కో ఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ మదనయ్య, వార్డ్  మెంబర్ చిరంజీవి పాలుగోన్నారు.

రజక కులస్తుల ను గ్రామా బహిష్కరణ చేసినవారిని



రెబ్బెన, మే12(వుదయం ప్రతినిధి): కాగజ్ నగర్ మండలంలోని హరేగూడ గ్రామా పరిదిలో గల 17 రజక కుటుంబాలు తమకు  వారం లో ఒక రోజు సెలవు కావాలని అడిగినందున,  హరేగూడ కు చెందినా అరె మరియు ఇతర కులస్తులు కలిసి  17 రజక కుటుంబాలను  గ్రామా బహిష్కరణ చేసి వారికి సహాయనిరాకరణ మరియు వారిని బట్టలు ఉతకడానికి పిలవడం లేదు అని అటువంటి వారిని కటినంగా శిక్షించాలని వారు రెబ్బెన మండల తహసిల్డారుకు వినతి పత్రం సమర్పిస్తూ కోరారు, ఈ కార్యక్రమంలో రజక కుల రాష్ట్ర నాయకులూ కడ్తాల మల్లయ్య, మండల రజక కుల సంఘం అధ్యక్షులు రామడుగుల శంకర్, జిల్లా నాయకులూ చంద్రగిరి శ్రీనివాస్, రాచకొండ రమేష్, పొదిలి రంగయ్య, తిరుపతి, రాములు పాలుగోన్నారు.  

Sunday, 10 May 2015

గుర్తుతెలియని వాహనం డీకోని ఒకరు మృతి 

రెబ్బన మండలంలో ఆదివారం తెల్లవారిజామున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో దుర్గం రాజు (38) ద్విచాక్రవానంపై పులికుంట నుండి రెబ్బెన కు తన అన్నయ్య కొడుకు పెల్లి పనుల నిమ్మిత్తం వెళ్ళుతుండగా పల్లవిబ్రిడ్జ్, బొగ్గు డంపింగ్ యార్డ్ వద్ద  గుర్తుతెలియని వాహనం డీకొట్టడం తో రాజు అక్కడిక్కడే మరణించాడు, మృతదేహాన్ని  పోస్టుమార్టం కొరకై బెల్లంపల్లి ఆసుపత్రి కి తరలించడం జరిగిందని రెబ్బెన ఎస్.ఐ . సి.హెచ్  హనోక్  తెలిపారు .  

Wednesday, 6 May 2015

పలు డిమాండ్ల సాధనకై నిరహరదిక్ష చేప్పట్టిన సి.పి.ఐ. పార్టీ కార్యకర్తలు


రెబ్బెన, మే 6 (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండల కేంద్రం లో సి.పి.ఐ. పార్టీ నాయకులూ, కార్యకర్తలు నిరాహార దీక్ష చెప్పట్టారు, పలు సమస్యల పరిష్కారం కొరకు జిల్లా వ్యాప్తంగా సాముహిక ధర్నాలు, నిరాహార దీక్షలు చెప్పట్టింది, వారు రెబ్బెన మండల తహసిల్దారుకు పలు డిమాండ్లు ఉన్న  మెమొరాండం ను సమర్పించారు, ప్రాణహిత-చేవెల్ల ప్రాజెక్ట్ పనులు తుమ్మిదిహెట్టి నుండే కొనసాగించాలని, ప్రాదాన్యత క్రమంలో తూర్పు ఆదిలాబాద్ జిల్లా లోని అన్ని నియోజికవర్గాలకు 1,66,000 ల ఎకరాల భూములకు సాగు నీరు ప్రజలకు త్రాగు నీరు అందిచాలి, కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక భూ సేకరణ అర్దినేన్సును వెంటనే ఉపసంహరించాలని, దీర్ఘకాలంగా అడవి భూములలో సాగు చేస్తున్న గిరిజన,దళిత, బలహీన వర్గాల రైతులకు భూ యాజమాన్య హక్కు లు కలిపించాలి, ప్రభుత్వం సిర్పూర్ పేపర్ మిల్లు ను వెంటనే తెరిపించి, కార్మికుల ప్రాణాలను కాపాడాలి, చనిపోయిన కార్మికుల కుటుంబలకు 10 లక్షల ఎక్ష్ గ్రేషియా చెల్లించాలి, తెరాస ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిర్ణిత సమయలోగా యుద్దప్రథిపాదిగా అమలుజరపాలని సి.పి.ఐ. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు అయినటువంటి ఎస్. తిరుపతి తెలిపారు, ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ జాది గణేష్, గోలేటి పట్టణ కార్యదర్శి బి. జగ్గయ్య కత్తెర శాల పోషం, ఎమ్.సత్యనారాయన, రాయిల్ల నర్సయ్య, దుర్గం రవీందర్ బోగి మల్లయ్య, డి.ఈశ్వర్  తదితర నాయకులూ పాలగోన్నారు 

ఆర్‌టీసీ కార్మికుల సమ్మెతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు


రెబ్బెన, మే 6 (వుదయం ప్రతినిధి): ఆర్‌టీసీ కార్మికుల సమ్మెతో డిపోలోనే బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెబ్బెన నుండి ఆసిఫాబాద్, కాగజ్ నగర్, బెల్లంపల్లి  వెళ్ళలంటే ఆటోలను ఆశ్రయించవలసి వస్తుంది. రోజు నిన్నటిదాక ఉన్న ఆటో చార్జిలు నేడు ఆర్‌టిసి సమ్మెతో మూడింతలు పెంచారు ప్రయాణికులు వాపోతున్నారు. బుధవారం వివహ శుభాకార్యాలు అధికంగా ఉండటంతో ప్రయాణీకులు చేసేదిఏమి లేక ఆటో వాల్లు అడిగిన కాడికి చార్జిలు చెల్లించి ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తాత్కలికంగా ఆర్‌టిసి బస్సులు నడిపేటట్లు చర్యలుతీసు కోవాలని పలువురు ప్రయాణీకులు కోరుచున్నారు

Saturday, 2 May 2015

వేకువజామున లారి కలకలం




రెబ్బన మండలంలో శనివారం రోజున ప్రధాన  రహదారి గుండా వెళ్తున్న లారి నం. ఎపి29u2579 లైన్ బండి ఇనుప లోడ్ తో వెళ్ళే లారి రోడ్ కి 30 ఫీట్ దూరంలో ఉన్న 3 షాపులను  ద్వంసం చేసినది. మొదట రోడ్ పక్కనే ఉన్న చెట్టు కొమ్మను  తగిలి, రోడ్ పక్కన  ఉన్న మోటార్ సైకిల్ మెకానిక్ మల్లేష్ షాపు ముందు ఉన్నరేకుల షడ్డుకు డీకొట్టి  పక్కషాపు దుర్గారావు లారి గ్యరెజిలో చొరబడి పక్కనే ఉన్న శ్రీరాజేశ్వర వెల్డింగ్ వర్క్స్ షాపులోకి దుసుకేల్లింది. స్థానికులు చెప్పిన ప్రకారంగా రాత్రి 3 గంటల సమయంలో జరిగింది. రోడ్ పక్కనే పెద్ద శబ్దం రావడంతో మెకానిక్ మల్లేష్ వచ్చిచూడగా,లారి ఇరుక్కు పోయి ఉన్నది అని లారి చూసినానని చెప్పాడు. డ్రైవర్, క్లీనర్ పరారిలో ఉన్నారు. సంఘటన తెల్లవారుజామున జరగటం వలన ప్రాణ నష్టం జరగలేదు కాని ఆస్థి నష్టం జరిగింది.  

ఘనంగా జరిగిన మేడే వేడుకలు

రెబ్బెన మండలంలోని మేడే సందర్భంగా ఎడవెల్లి గ్రామంలో శుక్రవారం  నాడు సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా సీపీఐ మండల సహాకార్యదర్శి ముల్యం బుద్దజీ జెండాను

 ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జాడి గణష్‌ హజరై 

మాట్లాడుతూ నేడు కార్మిక హక్కుల దినం కావడంతో కార్మికుల హక్కులకై పొరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.

 కార్యక్రమంలో జాడి తిరుపతి, నారాయణ, ఎడవెల్లి గ్రామ సహాయ కార్యదర్శి దుర్గం గోపాల్‌ పాల్గొన్నారు.  

రెబ్బెన మండలంలోని ఘనంగా జరిగిన మేడే వేడుకలు


రెబ్బెన మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం మేడేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ

మండల కార్యదర్శి శంకర్‌ జెండావిష్కరించారు. అనంతరం కార్మికుల హక్కుల దినోత్సవం కాబట్టి కార్మికుల

హక్కులకై పోరాడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు కార్యదర్శి, జిల్లా ఉపాధ్యక్షులు ఉపేంధర్‌,

 ఎఐవైఎఫ్‌ మండల కార్యదర్శి సంతోష్‌, ఎఐవైఎఫ్‌ ఆసిఫాబాద్‌ డివిజన్‌ కార్యదర్శి, పెద్దయ్య, గణష్‌, శంకర్‌లు

పాల్గొన్నారు

వడదెబ్బతాకిడికి ఒక వ్యక్తి మృతి

 రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామపంచాయితీ పరిధిలో  గురువారం నాడు ఎన్టీఆర్‌ కాలనీ కి చెందిన గొలుసుల సాయిలు (65) అనే వ్యక్తి పనికి వెళ్లి తిరిగి వచ్చే టప్పుడు మార్గమద్యంలో  వాంతులు చేసుకుని పడిపోయాడు గమనించిన  కుమారుడు సాయిలు తండ్రి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.