Thursday, 31 July 2025

మహిళలు, చిన్నపిల్లల రక్షణ కోసం భరోసా సెంటర్లు : జిల్లా ఎస్పీ శాంతి లాల్ పాటిల్

కొమరం భీమ్  ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి:

  జిల్లాలోని మహిళలు, యువతులు ఎవరైనా హింసకు, లైంగిక వేధింపులకు గురి అయినట్లయితే  నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని , షీ టీం భరోసా సెంటర్ అండగా ఉంటుంది అనిbజిల్లా ఎస్పీ  కాంతిలాల్ పాటిల్ ఐపిఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.  మహిళలు, చిన్నపిల్లల రక్షణ కోసం, భరోసా సెంటర్లు పనిచేస్తున్నాయని తెలిపారు. విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యం గా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాల, పాఠశాలల విద్యార్థులకు ర్యాగింగ్, ఈవీ టిజింగ్, ఫోక్సో, షీటీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ పై షీ టీం , భరోసా టీం మరియు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు.  మహిళలు పనిచేసే ప్రదేశాల్లో ఏదైనా హింసకు గురి అయినట్లయితే పోలీస్ స్టేషన్ ని సంప్రదించాలని తెలియజేశారు.  తదుపరి భరోసా టీం ద్వారా, కౌన్సిలింగ్, స్టేట్మెంట్ రికార్డింగ్, మెడికల్, రెహబిలిటేషన్  సదుపాయాలు కల్పిస్తునన్నాము  అని, విద్యార్దిని, విద్యార్థులకు మహిళలు సామాజిక మాద్యమాలైన ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఫొటోలు, వీడియోలు పోస్టుచేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించి అన్ని రకాల భద్రత చర్యలు తీసుకోవాలని సూచించారు. మత్తు పదార్థాలకు బానిస అవ్వడం వల్ల కలిగే నష్టాలు, శిక్షలు, వాటి సమాచారం తెల్సిన పోలీస్లకు పిర్యాదు చేయాలనీ,బాల్య వివాహలపై అవగాహనా, ముఖ్యంగా, మైనర్ పిల్లల పై అత్యాచారం, వేధింపులు, ప్రేమల వల్ల జరిగే అనర్దాలు మరియు శిక్షల గురించి అవగాహనా,ఎవరైనా మహిళలు ,పిల్లలు హరాష్మెంట్ గురి అయినట్లు గమనిస్తే, పోలీసులను నేరుగా సంప్రదించలేని వారు భరోసా ని సంప్రదించాలని తెలియజేశారు.  ఆసిఫాబాద్ జిల్లా భరోసా నెంబర్ 8712670561,  లేదా డయల్ 100,112 కు సమాచారం అందించాలని, సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం  జరుగుతుందని ఎస్పీ తెలిపారు.

విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలి


జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి

కొమరం భీమ్ : ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి: 

ప్రభుత్వం జూనియర్ కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు సమాజ విలువలతో కూడిన గుణాత్మక విద్యను అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థుల హాజరు పట్టిక, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనకు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలో కళాశాలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించడంతో పాటు నిష్ణాతులైన అధ్యాపకులతో విద్యాబోధన అందించాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. కళాశాలలో చేయవలసిన మరమ్మత్తులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆర్. ఆర్. కాలనీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ప్రభుత్వం నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, లబ్ధి పొందిన వారు నిబంధనల ప్రకారం 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపట్టాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు సకాలంలో అందించేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

Wednesday, 30 July 2025

శ్యాం మృతికి కారణమైన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి : కేసరి ఆంజనేయులు గౌడ్

కొమరం భీమ్ జిల్లా: శ్యామ్ మృతికి కారణమైన వైద్య సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్ అన్నారు. కొమరం భీమ్ జిల్లా ‌ రెబ్బెన మండల కేంద్రంలోని పిహెచ్సి ఆరోగ్య కేంద్రంలో నిన్న రాత్రి గొల్లగూడెం కు చెందిన మొగిలి చిన్నాన్న కుమారుడు శ్యామ్ (నాలుగు సంవత్సరాలు)  పాము కాటు వేయడంతో వైద్యం అందక మరణించాడు.  బుధవారం హాస్పటల్ సందర్శించిన బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్ జిల్లా కార్యదర్శి కుందారపు బాలకృష్ణ  మాట్లాడుతూ రాత్రి 11:30 కు హాస్పిటల్కు తీసుకువచ్చిన వైద్యం అందించకపోవడంతో , ఆంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో వారు హుటాహుటిన బైకుపై బెల్లంపల్లి హాస్పిటల్ కి చేరుకున్న కొద్ది నిమిషాలకే మృతి చెందడం జరిగింది. రెబ్బెన హాస్పిటల్లో సరైన వైద్య సిబ్బంది లేకపోవడం, మందులు అందుబాటులో లేకపోవడం , ఉన్న సిబ్బంది వారు మధ్యాహ్నానికే ఇంటికి వెళ్లడం జరుగుతుందని, వీరీ పై అధికారుల పర్యవేక్షణ కరువైందని అన్నారు. రెబ్బెన మండలంలో సుమారుగా 80000 జనాభా ఉంటుందని రేబ్బెన నేషనల్ హైవేపై ఎప్పటికీ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని,   దీనికి ఒకే ఒక్క డాక్టర్ నియమించడం ఆ డాక్టర్ కి జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ గా బాధ్యతలు అప్పగించడంతో రెబ్బెన మండల ప్రజలకు సరైన వైద్యం అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనిఅన్నారు.  ప్రజల ప్రాణాలు కాపాడాలన్న సోయిలేదని దీనిపై ప్రభుత్వ అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ఈ ఆసుపత్రిలో ప్రజలకు సరైన వైద్యం అందడం లేదని, అసలే వర్షాకాలం ఇలాంటి సమయంలో వైద్య సిబ్బంది పూర్తిగా అప్రమత్తంగా ఉండి అందుబాటులో ఉండవలసి ఉండగా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా చిన్నారి బాలుడు మృతి చెందడానికి వైద్య సిబ్బంది కారణం.  ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని నియమించి రోగుల ప్రాణాలను కాపాడాలని బిజెపి డిమాండ్ చేస్తుంది. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం .ఈ కార్యక్రమంలో  బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి మల్లేష్ , లక్షింపూర్ మాజీ సర్పంచ్ కోలే శ్యామ్ రావు. ఎనగంటి శ్రీశైలం. చౌదరి సుభాష్. కాశవేణి మల్లేష్  తదితరులు పాల్గొన్నారు.