కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి:
జిల్లాలోని మహిళలు, యువతులు ఎవరైనా హింసకు, లైంగిక వేధింపులకు గురి అయినట్లయితే నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని , షీ టీం భరోసా సెంటర్ అండగా ఉంటుంది అనిbజిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపిఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, చిన్నపిల్లల రక్షణ కోసం, భరోసా సెంటర్లు పనిచేస్తున్నాయని తెలిపారు. విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యం గా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాల, పాఠశాలల విద్యార్థులకు ర్యాగింగ్, ఈవీ టిజింగ్, ఫోక్సో, షీటీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ పై షీ టీం , భరోసా టీం మరియు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. మహిళలు పనిచేసే ప్రదేశాల్లో ఏదైనా హింసకు గురి అయినట్లయితే పోలీస్ స్టేషన్ ని సంప్రదించాలని తెలియజేశారు. తదుపరి భరోసా టీం ద్వారా, కౌన్సిలింగ్, స్టేట్మెంట్ రికార్డింగ్, మెడికల్, రెహబిలిటేషన్ సదుపాయాలు కల్పిస్తునన్నాము అని, విద్యార్దిని, విద్యార్థులకు మహిళలు సామాజిక మాద్యమాలైన ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఫొటోలు, వీడియోలు పోస్టుచేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించి అన్ని రకాల భద్రత చర్యలు తీసుకోవాలని సూచించారు. మత్తు పదార్థాలకు బానిస అవ్వడం వల్ల కలిగే నష్టాలు, శిక్షలు, వాటి సమాచారం తెల్సిన పోలీస్లకు పిర్యాదు చేయాలనీ,బాల్య వివాహలపై అవగాహనా, ముఖ్యంగా, మైనర్ పిల్లల పై అత్యాచారం, వేధింపులు, ప్రేమల వల్ల జరిగే అనర్దాలు మరియు శిక్షల గురించి అవగాహనా,ఎవరైనా మహిళలు ,పిల్లలు హరాష్మెంట్ గురి అయినట్లు గమనిస్తే, పోలీసులను నేరుగా సంప్రదించలేని వారు భరోసా ని సంప్రదించాలని తెలియజేశారు. ఆసిఫాబాద్ జిల్లా భరోసా నెంబర్ 8712670561, లేదా డయల్ 100,112 కు సమాచారం అందించాలని, సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.