Tuesday, 22 June 2021

నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరమైన చర్యలు : రెబ్బెన ఎస్ ఐ భవాని సేన్



 రెబ్బెన : నకిలీ విత్తనాలు క్రయవిక్రయాలు జరిపిన వారిపై  పీడీ యాక్ట్ చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు ఉంటాయి అని రెబ్బెన ఎస్ ఐ భవాని సేన్ అన్నారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ నిభంధనల ప్రకారం,  కొమురం భీం జిల్లా ఆసిఫాబాదు డి‌జి‌పి   ఎస్‌పి Y.V.S సుధీంద్ర ఆదేశాల మేరకు  పోలీస్ సిబ్బంది ,వ్యవసాయ అధికారి సిబ్బంది  సహాయముతో మద్వైగుడా గ్రామంలో తనిఖీ  చేయగాఅలగం శ్రీనివాస్ దగ్గర ఒక కింట 50 కిలోల గ్రాసిల్  నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు తెలిపారు. వీటి విలువ 2లక్షల 40 వేలు ఉంటుందని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తూ పక్కా సమాచారంతో నకిలీ విత్తనాల సరఫరా విక్రయాలు జరిపే వారిపై దాడులు నిర్వహిస్తామని తెలిపారు.  గ్రామాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు.  ఎవరైనా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందులు అమ్ముతున్నారని సమాచారం  అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి జుమీడి పరిమళ ,పోలీస్ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.