విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
ప్రభుత్వ పాటశాలలో నియమాలకు విరుద్ధంగా మధ్యాహ్న పథకంలో సన్న బియ్యం పెట్టకుండా దొడ్డు బియ్యాన్ని పెడుతున్నారని
ఎన్,ఎస్,యు,ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్ అన్నారు. రెబ్బెన లోని నంబాల ప్రాథమిక పాటశాలకు మంగళవారం వెళ్ళగా ఈ దుస్థితి కనిపిచిందని, విద్యార్థులకు ఇలా చేయడం వల్ల పౌష్టికాహార లోపం జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. ఈ కార్యాక్రమంలో నాయకులు మండల అధ్యక్షుడు నదీం, పట్టణ అధ్యక్షుడు అబ్బు, సంజీవ్, ముజ్జ, సాయి, వినోద్, లింగయ్య, ఎం, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment