బెల్లంపల్లి ఏరియా గోలేటి జీ,యం రవి శంకర్ శుక్రవారం నాడు కేస్లాపూర్ లోని భూ నిర్వాసితుల పునరావాస కేంద్రంలో కమిటీ నూతన పాటశాల భవనానికి కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేశారు. అనంతరం సింగరేణి సంస్థలోభూములు కోల్పోయిన భూ నిర్వాసితుల సమస్యలపై చర్చించారు ఈ సమావేశంలో జీ,యం రవి శంకర్ మాట్లాడుతూ సింగరేణిలో భూములు కోల్పోయిన వారికీ భూ పట్టాలను అందజేస్తామని అన్నారు. వాటర్ ట్యాంక్ నిర్మించి ఇంటింటా నీటి సదుపాయం కల్పిస్తామని, నిరుద్యోగ యువత ఒక సంఘంగా ఏర్పడితే అర్హులైన వారికి కాంట్రాక్ట్ పనులను పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డి. జి,యం చితరంజన్, డి,జి,యం(సివిల్) రామకృష్ణ, టి,జి,బీ,కే,యస్ కార్యదర్శి యన్,సదాశివ్ఏ,ఐ,టీ,యు,సీ,కార్యదర్శి యస్,తిరుపతి, ప్రాజెక్ట్ అధికారి సంజీవ్ రెడ్డి , డి,వై,పి,యం రాజేశ్వర్ రావు, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment