రెబ్బెన: రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వచ్చిన ఇంటర్ మీడియట్ పర్యవేక్షణ అధికారి ప్రభాకర్‌కు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్ మాట్లాడుతూ... ఖాలీగా ఉన్న అధ్యాపక అటెం డర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. నిబంధనలు పాటించని ప్రైవేటు కళాశాలలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోనాయకులు సాయి, రాజు, కార్తిక్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment