రెబ్బెన : గురువారం రాత్రి ఈదురుగాలులతో వర్షం కురియడం వల్ల రెబ్బెన మండలంలోని ఆర్అండ్బీ భవనం ఆవరణంలో ఉన్న 100డబ్ల్యూ కెపాసిటీ గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పై పిడుగు పడింది. ఈ పిడుగు పాటు వలన ట్రాన్స్ఫార్మర్లో భారీ ఎత్తున శబ్దం వచ్చి మంటలు చెలరేగాయి. ఈ భారీ మంటలు రాత్రి నుంచి ఉదయం వరకు మండుతూనే ఉన్నాయి. దీనితో విద్యుత్ అధికారులు అప్రమత్తమై మంటలను చల్లార్చారు. రాత్రి నుంచి ట్రాన్స్ఫార్మర్ పరిధిలో గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
No comments:
Post a Comment